AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షం వచ్చే ముందు కప్పలు ఎందుకు అరుస్తాయి? కప్పలకు వానకు సంబంధం ఏంటి?

వర్షాకాలం ప్రారంభం అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో తొలకరి చినుకులు పడుతున్నాయి. ఇక మన పెద్ద వారు వర్షాన్ని కొన్ని సంకేతాల ద్వారా గుర్తిస్తారు. ముఖ్యంగా కప్పలు అరుపులు వినిపిస్తే చాలు వర్షం వస్తుందని చెప్పుకొస్తుంటారు. కాగా, అసలు కప్పలకు వానకు మధ్య సంబంధం ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 27, 2026 | 9:10 AM

Share
ఈ ప్రకృతిలో అనేక వింతలు ఉన్నాయి. ఇవి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి.. ఆశ్చర్యానికి కూడా గురి చేస్తాయి. అయితే వర్షం రావడానికి ముందు కప్పలు ఎక్కువగా సౌండ్ చేస్తాయని అంటారు మన పెద్దవారు. అంతే కాకుండా చాలా సందర్భాల్లో కప్పలు అరిచిన తర్వాత వర్షాలు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా వానాకాలం మాత్రమే ఇవి ఎక్కువగా అరుస్తుంటాయి.

1 / 5
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వర్షం పడే ముందు కప్పలు ఎందుకు అరుస్తాయో.. దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కప్పలు అనేవి ఉభయచర జీవులు. ఇవి నీరు, తేమ ఉన్న ప్రదేశంలోనే ఎక్కువగా ఉంటాయి. ఇవి లేకపోతే ఇవి తమ జీవనం సాగించలేవు, బతకలేవు. ఎందుకంటే? ఇవి శ్వాసించడానికి నీరు, తడి, తేమ వాతావరణం చాలా అవసరం. అందుకే కప్పలు ఎక్కువ నీరు ఉన్న చోట, తేమ  వాతావరణంలో ఉంటాయి.

2 / 5
మరి వర్షానికి కప్పలకు సంబంధం ఏమిటి? అసలు వీటికి లింక్ ఉందా అంటే? అవును అనే అంటున్నారు నిపుణులు. కప్పలకు వర్షం అంటే చాలా ఇష్టం. అంతే కాకుండా ఈ సమయంలో అవి ఎక్కువగా బయటకు రావడానికి, స్వచ్ఛమైన వాన నీటిలో ఈదడానికి ఆసక్తిని చూపుతాయంట.  అందుకే వర్షం వచ్చే సమయాన్ని ఇవి పసిగట్టి అరుస్తాయని చెబుతున్నారు.

3 / 5
అంతే కాకుండా వర్షాకాలం కప్పల ప్రత్యుత్పత్తి కాలం. ఈ సీజన్‌లో కప్పలు తమ తోడు కోసం అరుస్తాయంట. వర్షం పడే ముందు ఇవి పసిగట్టి,  వర్షం పడుతుంది అనే సంకేతాలు కనిపించిన తర్వాత ఆడ కప్పలను వశ పరుచుకోవడానికి మగ కప్పలు , ఆనందంతో పెద్ద గొంతుతో అరుస్తాయంట.  అంతే కాకుండా ఈ సమయంలో వీటికి ఆహారం కూడా ఎక్కువగా లభిస్తుంటుంది. అందువలన వర్షకాలం అంటే వీగి చాలా ఇష్టం ఉంటుందంట.

4 / 5
 నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా, నిపుణుల సమాచారం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు అని పాఠకులు గమనించాలి. ఇది కేవలం పాఠకుల ఆసక్తిమేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది.

5 / 5
Follow Us