AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram: వార్నీ.. ఇన్‌స్టాలోని ఈ ఫీచర్స్‌తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా?.. ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం!

మెటా సంస్థ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ అయిన ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్ యాప్‌లలో యూజర్స్‌ కోసం సరికొత్త కీలక మార్పలు తీసుకొచ్చింది. యూజర్స్‌కు మరింత మెరుగైన సేవలను అందించే లక్ష్యంతో థ్రెడ్స్‌, ఇన్‌స్టా అల్గారిదమ్స్‌లో ఛేంజేస్ చేసింది. థ్రెడ్స్‌లో యువర్ ఆల్గో, ఇన్‌స్టాగ్రామ్‌లో యువర్ అల్గారిథమ్ అనే కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇంతకూ ఈ కొత్త ఫీచర్స్ ఏంటి.. ఇవి ఎలా పనిచేస్తాయి. వీటి వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం పదండి.

Anand T
|

Updated on: Jun 27, 2026 | 9:13 AM

Share
తమ యూజర్స్‌ కోసం మెటా సంస్థ ఇన్‌స్టా, థ్రెడ్స్‌లో సరికొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. యూజర్స్‌ తమ ఫీడ్‌లను తమ కంట్రోల్‌లో ఉంచుకునేందుకు సహాయపడేలా మెటా తన ఇన్‌స్టాగ్రామ్, థ్రెడ్స్ యాప్‌లలో కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లను డిజైన్ చేసింది. ఈ కొత్త ఫీచర్స్ ద్వారా మీరు ఇన్‌స్టా స్క్రోల్ చేస్తున్నప్పుడు మీకు నచ్చిన కంటెంట్ మాత్రమే స్క్రీన్ పై కనిపిస్తుంది.

1 / 5
థ్రెడ్స్‌లో యువర్ అల్గో: ఈ ఫీచర్ ద్వారా థ్రెడ్స్ యాప్‌లో మీకు ఎలాంటి విషయాలు ఎక్కువగా కావాలి లేదా వద్దు అనేదాన్ని మీరు ప్రైవేట్‌గా సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు.. మీకు ఎక్కువగా స్పోర్ట్స్ కు సంబంధించిన పోస్ట్‌లు  రావాలని అనుకుంటే, మానసిక ఒత్తిడిని కలిగించే పోస్ట్‌లు తగ్గాలని అనుకుంటే మీరు ఈ కొత్త ఆప్షన్ ద్వారా ఎంచుకోవచ్చు. అయితే ఈ ఆప్షన్ ఒక రోజు నుండి ఒక వారం వరకు మాత్రమే యాక్టివ్‌గా ఉంటుంది.

2 / 5
ఇన్‌స్టాగ్రామ్‌లో యువర్ అల్గోరిథం: ఇన్‌స్టాగ్రామ్ అసలు ఏ బేసిస్ మీద మీకు పోస్ట్‌లను రికమండ్ చేస్తోంది అనేది ఈ ఫీచర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ లేని టాపిక్స్‌ను మీరే స్వయంగా మార్చుకోవచ్చు. ఈ మార్పులు ఫీడ్, ఎక్స్‌ప్లోర్,  రీల్స్.. ఈ మూడింటికీ వర్తిస్తాయి.

3 / 5
గతానికి, ఇప్పటికీ తేడా ఏంటి?: ఇంతకుముందు సోషల్ మీడియా యాప్‌లు మీరు లైక్ చేసిన లేదా చూసిన పాత డేటాను బట్టి మీకు కంటెంట్‌ను రికమండ్ చేసేవి. కానీ ఇకపై అలా ఉండదు. వినియోగదారులే తమకు ఎలాంటి కంటెంట్ కావాలో వారే డిసైడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తి వారికి స్వేచ్ఛను ఇవ్వడమే అనే ఉద్దేశంతో తీసుకొచ్చినట్టు మెటా పేర్కొంది.

4 / 5
ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మొస్సేరి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ AI టెక్నాలజీ వల్ల అల్గారిథమ్‌లు ఎలా పనిచేస్తాయనేది వినియోగదారులకు సులభంగా అర్థమవుతుందని.. గందరగోళం తొలగిపోతుందని అన్నారు. మొత్తానికి, ఇకపై మీ సోషల్ మీడియా ఫీడ్‌లో ఏం రావాలో మీరే డిసైడ్ చేయవచ్చు. అనవసర కంటెంట్‌కు దూరంగా ఉండవచ్చు.

5 / 5
Follow Us