AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken Prices: నాన్ వెజ్ ప్రియులకు పిడుగులాంటి వార్త.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు.. ఎంతంటే..?

చికెన్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో పాటు కోడి గుడ్ల ధరలు కూడా ఆమాంతం పెరిగాయి. అసలే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలతో పాటు కూరగాయల ధరలు పెరగ్గా.. సామాన్యుడికి అందుబాటులో ఉండే చికెన్, గుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి.

Chicken Prices: నాన్ వెజ్ ప్రియులకు పిడుగులాంటి వార్త.. భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు.. ఎంతంటే..?
Chicken Prices
Venkatrao Lella
|

Updated on: Jun 27, 2026 | 9:20 AM

Share

నాన్ వెజ్ ప్రియులకు చేదువార్త. చికెన్, కోడి గుడ్డు ధరలు భారీగా పెరిగాయి. కిలో చికెన్ ఏకంగా రూ.300కి చేరుకుంది. కోళ్ల ఫామ్స్‌లో ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన ధరల వల్ల చికెన్ ముక్క లోపలికి పోవాలంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు ఇది పెద్ద భారంగా మారింది. గత కొద్ది వారాల్లోనే చికెన్ ధర రూ.50 మేర పెరిగింది. గతంలో రూ.250కే కేజీ బాయిలర్ చికెన్ లభించగా.. ఇప్పుడు ఏకంగా రూ.300కి చేరుకుంది. దీంతో పాటు కోడిగుడ్డు ధరలు కూడా పెరిగాయి. సామాన్యుడికి సరసమైన ధరల్లో ఉండే ఎగ్ ధరలు పెరగడం కూడా పెద్ద షాక్‌గా చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చికెన్, గుడ్డు ధరలు ఎలా ఉన్నాయనేది చూద్దాం.

హైదరాబాద్‌లో చికెన్, గుడ్డు ధరలు ఇవే..

హైదరాబాద్ జోన్‌లో కిలో స్కిన్ లెస్ చికెన్ రూ.292 వద్ద కొనసాగుతోండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.259కి చేరుకుంది. ఇక ఎక్స్ ఫారం లైవ్ బర్డ్ రూ.140 పలుకుతుండగా.. రిటైల్ లైవ్ బర్డ్ రూ.167గా ఉంది. ఇక 12 కోడి గుడ్ల రిటైల్ ధర రూ.88గా ఉంది.

విజయవాడ జోన్‌లో చికెన్ ధరలు ఇవే..

ఇక విజయవాడలో కిలో చికెన్ ధర రూ.298గా ఉండగా.. డ్రస్స్‌డ్ చికెన్ రూ.264గా ఉంది. ఇక ఫారం దగ్గర లైవ్ బర్డ్ రూ.143, రిటైల్ లైవ్ బర్డ్ రూ.170 పలుకుతోంది. ఇక 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.90 పలుకుతున్నాయి.

కరీంనగర్‌ జోన్‌లో ధరలివే..

ఇక కరీంనగర్ జోన్‌లో ఫారం దగ్గర కిలో లైవ్ బర్డ్ రూ.140, రిలైట్ లైవ్ బర్డ్ రూ.167, డ్రస్స్‌డ్ చికెన్ రూ.259, స్కిన్ లెస్ చికెన్ రూ.292గా ఉన్నాయి. ఇక 12 గ్రుడ్ల రిటైల్ ధర రూ.90 పలుకుతున్నాయి.

ఒక్కొ గుడ్డు రూ.10?

బయట షాపుల్లో ఒక్కొ గుడ్డు రూ.8కి విక్రయిస్తున్నారు. ఏప్రిల్‌లో ఒక్కొ గుడ్డు రూ.4గా కొనసాగగా. మే నాటికి రూ.5కి చేరుకుంది. ఇక జూన్ మొదటివారానికి రూ.6కి చేరుకోగా.. జూన్ చివరకు రూ.8కి చేరుకుంది. త్వరలోనే రూ.10కి చేరుకోనున్నాయని పాల్ట్రీ నిపుణులు చెబుతున్నారు. వేసవిలో ఎండ తీవ్రత వల్ల 10 శాతం కోళ్లు చనిపోవడంతో ఉత్పత్తి తగ్గింది. ఇక కోళ్ల మపేత, మెడిసిన్ ధరలు కూడా పెరిగాయి. ఈ ప్రభావం కోడి గుడ్ల ధరలపై పడింది. ఒక కోడి గుడ్డుకు మేత, మెడిసన్‌కుక రూ.7 పడుతోందని, అందుకే ధరలను పెంచాల్సి వచ్చిందని అంటున్నారు.

Follow Us