యారాడ డాల్ఫిన్ హిల్స్‌లోని నేవీ క్వార్టర్స్‌లో చెట్ల మధ్యలో గ్రీన్ పిట్ వైపర్ కనిపించింది. ఆకుల్లో కలిసిపోయి ఉండే ఈ విషపూరిత పాము త్రిభుజాకారపు తలతో, లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. స్నేక్ క్యాచర్ నాగరాజు దీనిని రక్షించారు. దీని కాటు తీవ్రమైన నొప్పి, రక్తస్రావం, వాపు కలిగిస్తుంది.