నాగ దేవత విగ్రహంపై.. పడగ విప్పిన నాగు పాము.. శివయ్య మహిమ అంటూ భక్తుల పూజలు
పెద్దపల్లి జిల్లా ఓదెలలోని శ్రీ పార్వతి శంభులింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఓ నాగుపాము నాగదేవత విగ్రహం పై పడగ విప్పింది. ఈ విగ్రహం పై నుంచి కింది వరకు వెళ్ళింది. అంతే కాకుండా నాగ దేవత విగ్రహం పై పడగ విప్పి..అటు..ఇటు తిరిగింది.. పడగ తోనే. విగ్రహం పై నిలబడింది. ఇలాంటి దృశ్యాలు సినిమా లో కనబడుతాయి. విగ్రహం పై నాగుం పాము పడగ విప్పడంతో.. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శివుడి మహిమ అంటూ ప్రత్యేక పూజలు చేశారు
త్వరలో నాగ పంచమి రానున్న నేపధ్యంలో తెలంగాణలోని పెదపల్లి జిల్లాలోని ఒక శివాలయంలో అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది. హిందువులు దేవతగా భావించి పూజించే నాగు పాము.. నాగ దేవత విగ్రహాన్ని చుట్టుకుంది. చాలా సేపు విగ్రహం పై నుంచి కదుల లేదు. ఎంత మంది భక్తులు వచ్చిన విగ్రహాన్ని వదిలి పెట్టలేదు.. అయితే ఈ విషయం ఆనోటా ఈ నోటా తెలిసిన భక్తులు భారీ సంఖ్యలో అరుదైన దృశ్యాన్ని చూడడానికి భారీగా తరలివచ్చారు. దేవుడి మహిమేనంటూ కీర్తించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెలలోని శ్రీ పార్వతి శంభులింగేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ఓ నాగుపాము నాగదేవత విగ్రహం పై పడగ విప్పింది. ఈ విగ్రహం పై నుంచి కింది వరకు వెళ్ళింది. అంతే కాకుండా నాగ దేవత విగ్రహం పై పడగ విప్పి..అటు..ఇటు తిరిగింది.. పడగ తోనే. విగ్రహం పై నిలబడింది. ఇలాంటి దృశ్యాలు సినిమా లో కనబడుతాయి. విగ్రహం పై నాగుం పాము పడగ విప్పడంతో.. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శివుడి మహిమ అంటూ ప్రత్యేక పూజలు చేశారు. స్థానికులు ఈ విషయం తెలుసుకున్న తరువాత పెద్ద సంఖ్యలో తరలివచ్చి తిలకించారు. అయితే ఎంతకీ పాము ఇక్కడి నుంచి కదుల లేదు. భక్తులు వెళ్లగొట్టేందుకు ప్రయత్నం చేశారు. అయితే.. ఈ పాము మాత్రం వెళ్ళలేదు. సహజంగా..ఏ చిన్న పాటి శబ్దం వచ్చిన పాములు పరుగులు తీస్తాయి..ఈ పాము మాత్రం విగ్రహానికి అల్లుకొని ఉంది.
దేవత విగ్రహం పైన పాము పడగ విప్పి అలాగే ఉండిపోయింది..ఈ సన్నివేశాన్ని చూడటానికి.. భక్తులు ఎంతో ఆసక్తి చూపారు.. పాము ఎంతకు వెళ్ళకపోవడంతో స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. దీంతో పామును పట్టుకొని దూర ప్రాంతంలో వదిలిపెట్టారు. అయితే.. మళ్ళీ ఈ ప్రాంతానికి పాము వచ్చే అవకాశం ఉందని భక్తులు అంటున్నారు. దేవుడు మహిమగానే భావించి పూజలు చేశారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..