Vasti Tips for Kitchen: వంటగదిలో ఈ వస్తువులు పడకుండా జాగ్రత్తపడండి.. లేకపోతే మానసిక ఆందోళన తప్పదట
ఇంటిపై, ఇంట్లో నివసించే సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వాస్తు శాస్త్రంలో వంట గదికి సంబంధించిన మూడు విషయాలు ప్రస్తావించబడ్డాయి. వంటగదిలో కొన్ని రకాల వస్తువులు తరచుగా పడిపోవడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. కనుక ఇంట్లో సానుకూల శక్తిని కొనసాగించడానికి ఈ మూడు ముఖ్యమైన వస్తువులను వంటగదిలో పడకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం.
వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో శక్తి సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. వంటగది ఆహారాన్ని వండడానికి మాత్రమే కాదు..అది ఇంటి ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యానికి చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. ఇంట్లో వంటగదిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే అది వాస్తు దోషాలను కలిగిస్తుంది. అనంతరం ఇంటిపై, ఇంట్లో నివసించే సభ్యులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వాస్తు శాస్త్రంలో వంట గదికి సంబంధించిన మూడు విషయాలు ప్రస్తావించబడ్డాయి. వంటగదిలో కొన్ని రకాల వస్తువులు తరచుగా పడిపోవడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. కనుక ఇంట్లో సానుకూల శక్తిని కొనసాగించడానికి ఈ మూడు ముఖ్యమైన వస్తువులను వంటగదిలో పడకుండా కాపాడుకోవడం చాలా ముఖ్యం.
వంటగదిలో ఈ 3 వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించండి
పాలు: చాలా సార్లు, పాలను మరిగిస్తున్న సమయంలో అవి గిన్నెలో నుంచి పొంగి పోర్లుతుంటాయి. వాస్తు శాస్త్రంలో ఇలా పదే పదే జరగడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిషశాస్త్రంలో పాలు చంద్ర గ్రహానికి సంబంధించినవిగా పరిగణించబడతాయి. అందువల్ల వంటగదిలో పదేపదే పాలు కింద పడితే అది జాతకంలో చంద్ర గ్రహానికి సంబంధించిన బలహీనతను సూచిస్తుంది. అటువంటి పరిస్థితిలో పాలు తరచుగా పడిపోవడం కుటుంబ సమస్యలకు, ఆర్థిక సమస్యలకు సంకేతం. పాలు పడిపోవడం ఆర్థిక సంక్షోభం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ వివాదాలకు కూడా కారణం కావచ్చు. పాలు పదే పదే కింద పడిపోతున్నయంటే కుటుంబం ఆర్థిక విషయాలపై, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని నమ్ముతారు.
ఉప్పు: ఉప్పు పడిపోవడం కూడా వాస్తు శాస్త్రంలో చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఉప్పు చంద్రుడు, శుక్ర గ్రహానికి ప్రాతినిధ్యంగా పరిగణించబడుతుంది. అందువల్ల ఉప్పు పడిపోవడం ఆర్థిక సంక్షోభం, కుటుంబ ఉద్రిక్తత, మానసిక అశాంతికి సంకేతం. ఇది ఇంట్లో ఆనందం, శాంతిని ప్రభావితం చేస్తుంది. తగాదాలకు కారణం అవుతుంది. అందువల్ల, ఉప్పును ఎల్లప్పుడూ సురక్షితమైన ప్రదేశంలో ఉంచండి. వంటగదిలో క్రమపద్ధతిలో ఉపయోగించండి.
వంట నూనెలు: వంటగదిలో వంట నూనె చాలా ముఖ్యమైనది. ఇది శనీశ్వరుడికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. వంట నూనెను పదే పదే కిందకు చిందించడం వల్ల శనిగ్రహానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఆవనూనె చిందించడం వల్ల ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందువల్ల ఆవనూనెను జాగ్రత్తగా వాడండి. చిందకుండా ఉండండి. తద్వారా ఇంట్లో సానుకూల శక్తి, శ్రేయస్సు ఉంటుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు