AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: సిరులు కురిపించిన టమాట.. నెల రోజుల్లోనే కోటీశ్వరులు అయిన ఇద్దరు రైతులు

పెరుగుతున్న ధరలతో కొన్ని హోటళ్లలో టమాటా వాడకాన్ని తగ్గించుకున్నాయి. కొన్ని చోట్ల చోరీలు జరుగుతున్నాయి. ఈ మధ్య కర్నాటకలోని సోమనహళ్లిలో ధరణి అనే టమాటా పంటను దొంగలు లూఠీ చేశారు.

Viral: సిరులు కురిపించిన టమాట.. నెల రోజుల్లోనే కోటీశ్వరులు అయిన ఇద్దరు రైతులు
Tomato
Ram Naramaneni
|

Updated on: Jul 17, 2023 | 5:16 PM

Share

ఎర్ర పండుకి ఎన్నడూ లేని గిరాకీ వచ్చింది. వంద.. నూటయాభై.. రెండు వందలు దాటి మూడు వందల వైపు రన్ రాజా రన్ అంటూ టామాటా ధరలు పరుగు పెడుతున్నాయి. కొండెక్కిన ధరతో సామాన్యుడి ఇంట టమాటా కరువైంది. చూసి సంతోషించడమే తప్ప కొనడానికి సాహసం చేయలేని పరిస్థితి. ఇక్కడా అక్కడా అని తేడా లేదు. దేశమంతటా ఎర్ర పండు టాక్‌ ఆఫ్‌ ది మార్కెట్‌గా మారిపోయింది. ప్రస్తుతం టమాటా యుగం నడుస్తోంది. టొమోట ధరలు ఆకాశాన్ని తాకడంపై రకరకాల కథనాలు వస్తున్నాయి. పెళ్లిళ్లలో కట్నాల దగ్గర నుంచి, టమాటాల కొనుగోలు కోసం బ్యాంక్ లోన్ లు ఇస్తున్నాయంటూ వార్తలు షికార్లు కొడుతున్నాయి. ఇక టమాటాలపై జోకులు, మీమ్స్, దొంగతనాలకు సంబంధించిన వార్తల సంగతి చెప్పనక్కర్లేదు. అంతేకాదూ దేవుడికే తులాభారం ఇచ్చే రేంజ్‌కి టమోటా ఎదిగిపోయింది. ఈ తులాభారం కథ జరిగింది ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లాలో.

ఇక పోతే.. మాములుగా వ్యాపారం చేసి కోట్లు అర్జింజినవారిని చూసి ఉంటాం కానీ.. వ్యవసాయం చేసి కోటీశ్వర్లు అయినవారు చాలా అరుదు. తాజాగా టమాటా ఆ ముచ్చట తీర్చేసింది. భారీగా ఎగబాకిన టమాట రేటు.. ఇద్దరు రైతుల్ని కోటీశ్వర్లున్ని చేసింది. మహారాష్ట్ర పుణె జిల్లాలో నివాసం ఉండే తుకారాం భాగోజి గాయకర్‌ అనే రైతు 12 ఎకరాల్లో టమాటా వేశాడు. గతంలో పండించిన అనుభవం ఉండటంతో ఈసారి కూడా దిగుబడి బాగా వచ్చింది. రేటు బాగా పెరగడంతో.. దాదాపు  రూ.కోటిన్నరకు పైగా ఇన్‌కమ్ వచ్చిపడింది. ఒక్కో బాక్స్‌ను దాదాపు రూ.2,100 చొప్పున నారాయణ్‌గంజ్‌ మార్కెట్‌లో అమ్మారు. మొన్న శుక్రవారం ఒక్కరోజే..  900 పెట్టెలను అమ్మడంతో రూ.18 లక్షలు వచ్చిపడ్డాయి.

ఇక ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం.. ధమ్‌తరీ జిల్లాకు చెందిన మరో రైతు అరుణ్‌ సాహూ ఏకంగా 150 ఎకరాల్లో టమాటా సాగు చేశాడు. వాతావరణం సహకరించడంతో మంచి దిగుబడే వచ్చింది. ఇక రేటు కూడా ఉండటంతో.. అతని ఆదాయానికి హద్దు లేకుండా పోయింది. రోజుకు 600 నుంచి 700 పెట్టెలు లెక్క అమ్మగా.. ఏకంగా కోటి రూపాయలకు పైగా నెల వ్యవధిలోనే సంపాదించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..