ఎక్సైజ్ అధికారి జాతీయ జెండావిష్కరించి గ్రూప్ ఫోటో దిగుతుండగా షాకింగ్ ఘటన.. !
మహారాష్ట్రలోని ధరాశివ్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక ఎక్సైజ్ అధికారి కుప్పకూలిపోయాడు. వేడుక జరుగుతుండగా ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షి తీసిన మొబైల్ ఫోన్ వీడియోలో మోహన్ జాదవ్ బ్యాలెన్స్ కోల్పోయి పడిపోతున్నట్లు స్పష్టంగా కనిపించింది.

మహారాష్ట్రలోని ధరాశివ్ జిల్లాలో ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఒక ఎక్సైజ్ అధికారి కుప్పకూలిపోయాడు. వేడుక జరుగుతుండగా ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి మరణించినట్లు అధికారులు తెలిపారు.
ఒమెర్గా తహసీల్‌లోని తల్మోడ్ సరిహద్దు చెక్‌పాయింట్ వద్ద జెండా ఎగురవేసే కార్యక్రమం జరుగుతోంది. వేడుక తర్వాత, 56 ఏళ్ల మోహన్ జాదవ్ సిబ్బందితో కలిసి గ్రూప్ ఫోటో కోసం నిలబడి ఉండగా అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే తోటి సిబ్బంది సమీపంలోని ఒమెర్‌గా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. షోలాపూర్‌లోని ప్రతాప్ నగర్ ప్రాంతంలో మోహన్ జాదవ్ నివసిస్తున్నారు.
ప్రత్యక్ష సాక్షి తీసిన మొబైల్ ఫోన్ వీడియోలో మోహన్ జాదవ్ బ్యాలెన్స్ కోల్పోయి పడిపోతున్నట్లు స్పష్టంగా కనిపించింది. అతను పడిపోతుండగా అతని సహోద్యోగులు సహాయం చేయడానికి పరుగెత్తారు. వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయింది. వైద్యులు మోహన్ జాదవ్‌ను పరిశీలించి చనిపోయినట్లు ప్రకటించారు.
మోహన్ జాదవ్ మరణవార్త కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలోకి నెట్టిందిది.. ఆ వార్త విని దిగ్భ్రాంతి చెందారు. సోమవారం రిపబ్లిక డే రోజు ఉదయం మోహన్ జాదవ్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని, ఆ కార్యక్రమానికి ఉత్సాహంగా బయలుదేరడని కుటుంబసభ్యులుు చెప్పారు. ఆయనకు ఏవైనా సమస్యలు ఎదురైనా, ఆయన ఎవరికీ చెప్పలేదు. ఆయన సహచరులు ఆయనను క్రమశిక్షణ కలిగిన, కష్టపడి పనిచేసే అధికారిగా గుర్తుంచుకున్నారు. మోహన్ జాదవ్ అంత్యక్రియలు షోలాపూర్‌లో జరిగాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
