AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: వీటిపై ఆశపడితే మీ జీవితం అల్లకల్లోలం అవ్వడం ఖాయం.. చాణక్యుడు ఏం చెప్పారంటే..?

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ప్రశాంతతను కోల్పోతున్నాడు. ఏదో సాధించాలనే తపనలో తనను తాను నాశనం చేసుకుంటున్నాడు. సరిగ్గా ఇదే విషయాన్ని వేల ఏళ్ల క్రితమే గొప్ప దౌత్యవేత్త, ఆర్థికవేత్త ఆచార్య చాణక్యుడు హెచ్చరించారు. మనిషి తన జీవితంలో కొన్ని విషయాల పట్ల ఎంత ప్రలోభానికి గురవుతాడంటే.. అవి తనను వినాశనం వైపు నడిపిస్తున్నాయనే విషయాన్ని కూడా మర్చిపోతాడట. మనశ్శాంతిని హరించే ఆ నాలుగు ప్రలోభాలేంటో ఇప్పుడు చూద్దాం.

Krishna S
|

Updated on: Jan 26, 2026 | 9:28 PM

Share
డబ్బు పట్ల వ్యామోహం: డబ్బుతో ఏదైనా కొనవచ్చు.. కానీ డబ్బు మాత్రమే జీవితం కాదని చాణక్యుడు స్పష్టం చేశారు. ధనం అవసరమే..కానీ అది వ్యామోహంగా మారకూడదు అని ఆయన చెప్పారు. కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా బ్రతికే వ్యక్తి తన ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, స్నేహితులను, చివరకు తన ఆనందాన్ని కూడా కోల్పోతాడు. డబ్బు వెంట పడి జీవితాన్ని పణంగా పెట్టవద్దని చాణక్య నీతి హెచ్చరిస్తోంది.

1 / 5
హోదా, ప్రతిష్టల ఉచ్చు: సమాజంలో గౌరవం ఉండాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ అడ్డదారిలో హోదాను, లేని ప్రతిష్టను దక్కించుకోవాలని చూడటం మనిషిని పెద్ద ఇబ్బందుల్లో పడేస్తుంది. చాలామంది సమాజంలో గొప్పగా కనిపించడానికి తప్పుడు మార్గాలను ఎంచుకుంటారు. అయితే అది తనను తాను మోసం చేసుకోవడమే అవుతుందని చాణక్యుడు చెప్పారు. ఇలాంటి ఆశలు ఒకరోజు మనిషిని పతనం వైపు తీసుకెళ్తాయి.

2 / 5
స్వార్థపూరిత సంబంధాలు: మన జీవితంలో ఉండే చాలా బంధాలు స్వార్థం మీదనే ఆధారపడి ఉంటాయని చాణక్యుడు నిర్మొహమాటంగా చెప్పారు. మన దగ్గర ఏదైనా ఆశించి వచ్చే వ్యక్తులు, వారి అవసరం తీరగానే దూరమైపోతారు. అలాంటి సంబంధాలను గుర్తుపట్టకుండా వాటిలో అతిగా లీనమైతే వారు దూరమైనప్పుడు కలిగే మానసిక వేదన మన ప్రశాంతతను దూరం చేస్తుంది. అందుకే ఎవరితోనైనా మితిమీరిన అనుబంధం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.

3 / 5
అంతం లేని భౌతిక సుఖాలు: భౌతిక సుఖాలకు అంతు ఉండదు. ఒక కోరిక తీరగానే మరొకటి పుడుతూనే ఉంటుంది. విలాసవంతమైన జీవితం అలవాటైన మనిషికి సంతృప్తి అనేది ఉండదు. అవి పెరుగుతూనే ఉంటాయి తప్ప తగ్గవు. ఈ సుఖాల వేటలో మనిషి తన సమయాన్ని, శక్తిని వృథా చేసి చివరకు శూన్యంతో మిగిలిపోతాడు.

4 / 5
చాణక్యుడి ప్రకారం.. జీవితంలో ఏదీ కూడా మితం తప్పకూడదు. అవసరాలను దాటి ఆశలు పెరిగినప్పుడు అది వినాశనానికి దారితీస్తుంది. సంపాదనలో నిజాయితీ, బంధాల్లో స్పష్టత, కోరికలపై నియంత్రణ ఉన్నప్పుడే మనిషి నిజమైన ఆనందాన్ని పొందగలడు.

5 / 5
వీటిపై ఆశపడితే మీ జీవితం అల్లకల్లోలం అవ్వడం ఖాయం.. చాణక్యుడు..

తరుణ్ భాస్కర్ తో రిలేషన్ షిప్.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..

కడక్‌నాథ్ కోడి మాంసం తింటే.. రోగాలు మాటాష్!

బంగ్లాను పాక్ తప్పుదారి పట్టిస్తోంది: బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్

బడ్జెట్ వేళ షాక్.. పెరగనున్న విద్యుత్ ఛార్జీలు..!

గ్రాండ్‌గా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న ఏనుగు పిల్ల..

అరెరే.. పాకిస్థాన్ ను అంత మాట అనేసిన మాజీ క్రికెటర్.. !

మనం పైనాపిల్‌ను తింటే.. అది మనల్ని తింటుందా.. దీన్ని వెనకున్న..

జుట్టు రాలడం వేధిస్తోందా? ఎవరూ చెప్పని సీక్రెట్ టిప్..

మీ పర్సులో ఈ 5 వస్తువులు ఉంటే లక్ష్మీ కాటాక్షం! మీకు డబ్బే డబ్బు