AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ భవన్ లో స్పెషల్ స్కిట్.. ఆయన పాత్ర చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే

తెలంగాణ భవన్ లో స్పెషల్ స్కిట్.. ఆయన పాత్ర చూస్తే పొట్ట చెక్కలవ్వాల్సిందే

Phani CH
|

Updated on: Jan 26, 2026 | 7:10 PM

Share

రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ భవన్‌లో ప్రదర్శించిన స్కిట్ కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనలను ఎత్తిచూపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీ "న్యాయపత్రం", ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా గద్దెల కూల్చివేత పిలుపు వంటివి రాజ్యాంగ హననమేనని ఆయన విమర్శించారు. రాజ్యాంగాన్ని అణగదొక్కడంలో కాంగ్రెస్, బీజేపీలు ఒకే రీతిలో ఉన్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఒక ప్రత్యేక నాటికను ప్రదర్శించారు. ఈ స్కిట్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారికి కనువిప్పు కలిగిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీ స్వయంగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుక్కుగూడలో ప్రచరించిన న్యాయపత్రం కేవలం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు. పార్టీ ఫిరాయింపులపై న్యాయపత్రంలోని హామీలకు విరుద్ధంగా రాహుల్ గాంధీ వెనకాలే పార్టీ మారినవారు కూర్చున్నారని ఆయన ఎత్తిచూపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Khammam: నేను చస్తే మీకు హ్యాపీనా? బోరున ఏడ్చేసిన గవర్నమెంట్ టీచర్ గౌతమి

Garimella Balakrishna Prasad: మరణానంతరం గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారం

Vijay Anand Reddy: పద్మశ్రీ అవార్డుతో హ్యాపీ.. రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తా

ఫేక్ కలెక్షన్స్.. ఎవరి కోసం.. ఎందుకోసం..?

ఫ్యామిలీ సినిమాలు దున్నేస్తున్నా.. స్టార్ హీరోల చూపు మాత్రం అటువైపే