AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khammam: నేను చస్తే మీకు హ్యాపీనా? బోరున ఏడ్చేసిన గవర్నమెంట్ టీచర్ గౌతమి

Khammam: నేను చస్తే మీకు హ్యాపీనా? బోరున ఏడ్చేసిన గవర్నమెంట్ టీచర్ గౌతమి

Phani CH
|

Updated on: Jan 26, 2026 | 7:07 PM

Share

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గౌతమి రీల్స్ చేసి వైరల్ కావడంతో సస్పెండయ్యారు. తెలియక చేశానని, వృత్తికి ద్రోహం చేయలేదని కన్నీరు పెట్టుకున్నారు. సోషల్ మీడియా ట్రోలింగ్‌తో తీవ్ర మనోవేదనకు గురైన ఆమె, ఆత్మహత్య ఆలోచనలు వ్యక్తంచేస్తూ, "నేను చచ్చిపోతే మీకు సంతోషమా?" అని ప్రశ్నించారు.

ఖమ్మం జిల్లాలో రీల్స్ చేసి వైరల్ కావడంతో సస్పెన్షన్‌కు గురైన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గౌతమి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలోని మామిళ్ళగూడెం ప్రభుత్వ హైస్కూల్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తున్న గౌతమి, తాను తెలియక రీల్స్ చేశానని, వృత్తికి ఎప్పుడూ ద్రోహం చేయలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన రీల్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడంతో, గౌతమి క్షమాపణ కోరారు. అయితే, సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దారుణమైన ట్రోలింగ్ పట్ల ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో తనను అన్యాయంగా ట్రోల్ చేస్తున్నారని, దీనివల్ల ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని ఆమె ఆవేదనతో తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Garimella Balakrishna Prasad: మరణానంతరం గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారం

Vijay Anand Reddy: పద్మశ్రీ అవార్డుతో హ్యాపీ.. రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తా

ఫేక్ కలెక్షన్స్.. ఎవరి కోసం.. ఎందుకోసం..?

ఫ్యామిలీ సినిమాలు దున్నేస్తున్నా.. స్టార్ హీరోల చూపు మాత్రం అటువైపే

Anil Ravipudi: అనిల్ రావిపూడి మాస్ ప్లానింగ్‌కు అందరూ ఫిదా