అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలోని ఓ జ్యూవెలరీ షాపులో నలుగురు మహిళలు చోరీకి ప్రయత్నించారు. నగలు చూస్తున్నట్లు నటించి దొంగతనానికి పాల్పడగా, షాపు యజమాని గమనించారు. ఒక మహిళను పట్టుకోగా, మిగతా ముగ్గురు పారిపోయారు. పట్టుబడ్డ మహిళ ఇచ్చిన సమాచారంతో మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.