AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FASTag: అదంతా ఫేక్‌.. ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ విషయంలో క్లారిటీ ఇచ్చేసిన NHAI

NHAI ఫాస్టాగ్ వార్షిక పాస్ అర్హతపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను NHAI ఖండించింది. 5 సీటర్లకే పాస్ అనే వార్త అవాస్తవం అని స్పష్టం చేసింది. కార్లు, జీపులు, వ్యాన్‌లతో సహా అన్ని నాన్-కమర్షియల్ వాహనాలకు రూ.3000తో 200 టోల్ ట్రిప్పులు అందించే ఈ వార్షిక పాస్ అందుబాటులో ఉంటుందని NHAI వెల్లడించింది.

FASTag: అదంతా ఫేక్‌.. ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌ విషయంలో క్లారిటీ ఇచ్చేసిన NHAI
Fastag Annual Pass
SN Pasha
|

Updated on: Jan 27, 2026 | 8:17 AM

Share

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఒక విషయంలో క్లారిటీ ఇచ్చేసింది. కేవలం 5 సీటర్‌ వాహనాలకు మాత్రమే ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌(FASTag Annual Pass)లు మంజూరు చేస్తారని, 7 సీటర్‌ వాహనాలకు ఇవ్వరనే వార్త ఒకటి సోషల్‌ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా NHAI స్పందించింది. అదంతా ఫేక్‌ న్యూస్‌ అని.. అన్ని రకాల నాన్‌ కమర్షియల్‌ వెహికల్స్‌కి వార్షిక పాస్‌ ఇస్తామని ప్రకటించింది. అందులో కారు, జీపు, వ్యాన్‌ వంటి అన్ని రకాల నాన్ కమర్షియల్‌ వెహికల్స్‌ ఉన్నాయి.

అసలేంటి ఈ అన్యువల్‌ పాస్‌..?

ఫాస్టాగ్ వార్షిక పాస్ అనేది నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా 2025 ఆగస్టు 15న ప్రారంభించిన ఒక కొత్త విధానం. ప్రైవేట్ కార్లు, జీపులు, వ్యాన్లు సంవత్సరానికి రూ.3,000 చెల్లించి, 200 టోల్ క్రాసింగ్‌లను (ట్రిప్పులు) పొందేలా ఈ స్కీమ్‌ తీసుకొచ్చింది. ఇది 1 సంవత్సరం లేదా 200 ట్రిప్పులు పూర్తయ్యే వరకు చెల్లుతుంది. దీనిని ‘రాజ్‌మార్గయాత్ర’ యాప్ లేదా NHAI వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు.

  • కేవలం వ్యక్తిగత/ప్రైవేట్ కార్లు, వ్యాన్లు, జీపులకు మాత్రమే వర్తిస్తుంది.
  • 200 ఉచిత టోల్ క్రాసింగ్‌లు అందుబాటులో ఉంటాయి. ఆ తర్వాత సాధారణ టోల్ ఛార్జీలు వర్తిస్తాయి.
  • NHAI, MoRTH ద్వారా నిర్వహించబడే జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై మాత్రమే చెల్లుబాటు అవుతుంది. రాష్ట్ర రహదారులకు ఇది వర్తించకపోవచ్చు.
  • యాక్టివేషన్ తేదీ నుండి ఒక సంవత్సరం లేదా 200 ట్రిప్పులు – ఏది ముందుగా వస్తే అది చెల్లుతుంది.
  • ఈ పాస్ నాన్-ట్రాన్స్ఫరబుల్. అంటే ఒక వాహనం ఫాస్టాగ్ మరొకదానికి ఉపయోగించకూడదు. ఇది చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్‌కు మాత్రమే లింక్ చేయబడుతుంది.

పాస్ ఎలా పొందాలి?

  • ‘రాజ్‌మార్గయాత్ర’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి, లేదా NHAI వెబ్‌సైట్‌ను సందర్శించండి.
  • మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ (VRN), లింక్ చేయబడిన ఫాస్టాగ్ వివరాలను ధృవీకరించుకోండి.
  • రూ.3,000 చెల్లింపు చేసిన తర్వాత, మీ పాస్ 2 గంటల్లో యాక్టివేట్ అవుతుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి