AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సర్జికల్‌ స్ట్రైక్స్ నుంచి.. ఆపరేషన్ సింధూర్‌ దాకా..! మనవైపు చూడాలంటేనే టెర్రర్ పుట్టాలె..

జనవరి 26... గణతంత్ర దినోత్సవం.. దేశానికి పునర్జన్మ కలిగినరోజు. దేశపు ఆత్మకు పుట్టినరోజు. గత జనవరి 26కు, ఈ జనవరి 26కు మధ్య మన దేశం మర్చిపోలేని అనుభూతుల్ని చవిచూసింది. ఈ ఏడాది.. పాకిస్తాన్‌ను గుండెల మీద తన్నిన ఏడాది.. ఉగ్రవాద అడ్డాలపై మన సాయుధ బలగాలు మెరుపుదాడి చేసి ముష్కర మూకల్ని నిర్మూలించిన ఏడాది.

సర్జికల్‌ స్ట్రైక్స్ నుంచి.. ఆపరేషన్ సింధూర్‌ దాకా..! మనవైపు చూడాలంటేనే టెర్రర్ పుట్టాలె..
Republic Day Parade 2026
Shaik Madar Saheb
|

Updated on: Jan 26, 2026 | 9:49 PM

Share

జనవరి 26… గణతంత్ర దినోత్సవం.. దేశానికి పునర్జన్మ కలిగినరోజు. దేశపు ఆత్మకు పుట్టినరోజు. గత జనవరి 26కు, ఈ జనవరి 26కు మధ్య మన దేశం మర్చిపోలేని అనుభూతుల్ని చవిచూసింది. ఈ ఏడాది.. పాకిస్తాన్‌ను గుండెల మీద తన్నిన ఏడాది.. ఉగ్రవాద అడ్డాలపై మన సాయుధ బలగాలు మెరుపుదాడి చేసి ముష్కర మూకల్ని నిర్మూలించిన ఏడాది. దేశమాత నుదుటన సింధూరం తీర్చిదిద్దిన ఏడాది. అంతకంటే ముఖ్యంగా.. కర్తవ్యపథ్‌గా మారిన రాజ్‌పథ్ నుంచి ప్రపంచానికి తొలి సందేశం ఇస్తున్న ఏడాది. మారింది పేరు మాత్రమే కాదు.. కర్తవ్యమూ మారిందని చాటాల్సిన ఏడాది. పైగా, ప్రపంచ భౌగోళిక రాజకీయాలు బాగా ముదిరిపోయి, మనతో మైండ్‌గేమ్ ఆడుతున్న పెద్దదేశాల ఎదుట ఛాతీ విరుచుకు నిలబడాల్సిన ఏడాది. అందుకేనేమో, ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం కోసం చాలా గట్టిగానే ప్లాన్ చేసింది భారతదేశం. కోట్లాది ఇండియన్ల హార్ట్‌ బీట్‌ని రిప్రెజెంట్ చేస్తూ సాగింది కర్తవ్య పథ్‌లో రిపబ్లిక్ డే పరేడ్. మిగ్‌–17 హెలికాప్టర్లు కురిపించిన పూలవర్షం.. రిపబ్లిక్ వేడుకకు శుభారంభం.. (function(v,d,o,ai){ ai=d.createElement("script"); ai.defer=true; ai.async=true; ai.src=v.location.protocol+o; d.head.appendChild(ai); })(window, document, "//a.vdo.ai/core/v-tv9telugu-v0/vdo.ai.js"); ఫేజ్‌డ్ బ్యాటిల్ అరే ఫార్మాట్.. యుద్ధ భూమిలో జరిగే ప్రతి దశను వరుసక్రమంలో చూపించే విధానం.. త్రివిధ దళాల సంయుక్త ఆపరేషన్ టేబ్లో ఆపరేషన్ సిందూర్ ఫస్ట్‌టైమ్ జనానికి పరిచయమైన హైపర్‌సోనిక్ గ్లైడ్ మిసైల్స్ ఇంకా, ఆటానమస్ రోబోటిక్ సిస్టమ్స్, స్వార్మ్ డ్రోన్లు.. ఒకటేమిటి ఈ ఏడాది పరేడ్‌లో అన్నీ ప్రత్యేకతలే. ఇప్పటివరకు చూసిన రిపబ్లిక్ డే పరేడ్‌లు ఒక లెవల్....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి