ఏలూరు జిల్లాలోని బుట్టాయిగూడెం ఏజెన్సీలో పెద్దపులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. పశువులపై తరచూ దాడులు చేస్తున్న పులి, తాజాగా మంచుల వారి గూడెం సమీపంలో కారుకు ఎదురొచ్చింది. ఈ ఘటనతో అటవీ శాఖ గాలింపు చర్యలు చేపట్టింది. ఏజెన్సీ వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.