జెన్-Z విద్యార్డులా మజాకానా.. జవాబు పత్రాలు చూసి ప్రోఫెసర్లే తడబడుతున్నారు! అసలు వీళ్లేం రాసారో తెలుసా..
GMG అంటే గుడ్ మార్నింగ్ నుంచి మొదలయ్యి ఎమోజిలు బట్వాడా తో రోజులో చాలాగంటల సమయం యువతి యువకులు గడిపేస్తున్నారు. ఐతే ఈ ప్రమాదం ఇపుడు విద్యర్డులపై పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే వాట్సప్ లో చాటింగ్ భాషను పరీక్షల జవాబు పత్రాల్లోనూ రాస్తున్నారట..

Kumaun University, Social Media language usage in University exams, College Students, Uttarakhand, Gen Z Generation, social media, Gen Z Generation students
ఉత్తరాలు రాయటం, అధ్యాపకులు చెప్పిన అంశాలు రన్నింగ్ నోట్స్ లు రాయటం వంటి అలవాటు ప్రస్తుత రోజుల్లో క్రమక్రమంగా కనుమరుగు అవుతోంది. ల్యాప్ టాప్, సెల్ ఫోన్, ట్యాబ్‌ల వాడకం నేపధ్యంలో ఇపుడు సంచారం కోడ్ భాషలో ఒకరి నుంచి మరొకరికి చేరుతుంది. GMG అంటే గుడ్ మార్నింగ్ నుంచి మొదలయ్యి ఎమోజిలు బట్వాడా తో రోజులో చాలాగంటల సమయం యువతి యువకులు గడిపేస్తున్నారు. ఐతే ఈ ప్రమాదం ఇపుడు విద్యర్డులపై పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే వాట్సప్ లో చాటింగ్ భాషను పరీక్షల జవాబు పత్రాల్లోనూ రాస్తున్నారట. ఉత్తరాఖండ్ లోని కుమాయూన్ విశ్వవిద్యాలయ పరీక్షల్లో విద్యార్థులు రాసిన జవాబులు ఇపుడు ప్రొఫెసర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయట.
విశ్వవిద్యాలయంకు చెందిన హల్ద్వానీలోని అనుభంద కళాశాల ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో విద్యార్థులు సోషల్ మీడియా, ముఖ్యంగా వాట్సాప్ చాట్ భాషను విస్తృతంగా ఉపయోగించటం ఆ ప్రాంతంలో చర్చ కు దారి తీసింది. విద్యార్థులు జవాబులు రాసే సమయంలో పూర్తి వాక్యాలకు బదులు షార్ట్‌కట్స్, ఇంగ్లీష్ అక్షర సంక్షిప్తాలు, చిహ్నాలు ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోనెల వినియోగంతో పెన్ ల వాడకం చాలావరకు తగ్గిపోయింది. అవసరమైన సమాచారాన్ని “నోట్స్ “ యాప్ లో బద్ర పరుచుకున్టున్నారు. ఇలా కీబోర్డ్ స్టైల్ రాతతో “Because” స్థానంలో “Coz”, “Between” స్థానంలో “B/w”., “Before” స్థానంలో “B4”., “And” స్థానంలో “&” ., చివరిలో “LOL” వంటి పదాలను విస్తృతంగా వినియోగించినట్లు అధ్యాపకులు గుర్తించారు. ఇక హింది , ఇంగ్లిష్ భాషల మిశ్రమంతో పదాలు వాడకం , కీ బోర్డ్ స్టయిల్ అంటే అక్షరాల తర్జుమా లో వినియోగించే అక్షరాల వినియోగం ఎక్కువగా కనిపించిందట. ఇక కొందరు విద్యార్దులు జవాబులను షార్ట్ కట్ లో అంటే రెండు , మూడు లైన్స్ లో రాసి ముగించేస్తున్నారట. వీటిని చూస్తే మెస్సేజ్‌లులా వున్నయని భావించిన ప్రోఫిసార్లు జనవరి ౩ నుంచి 6 వరకు జరిగిన పరిక్షల జవాబు పత్రాల పరిశిలన మరోసారి జరపాలని భావించింది.
“జెన్-జీ తరం” పిల్లల్లో ఈ తరహా లక్షణాలు
జెన్-జీ (Gen Z) అనేది ఒక Generation పేరు. సాధారణంగా 1997 నుంచి 2012 మధ్యలో పుట్టిన పిల్లలను జెన్-జీ తరం యువతగా పరిగణిస్తున్నారు. ఆయా సంవత్సరాల మద్యలో పుట్టిన పిల్లలు చిన్నప్పటి నుంచే మొబైల్, ఇంటర్నెట్, సోషల్ మీడియాతో పెరిగిన వాళ్లు. వీరికి వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, రీల్స్, షార్ట్ మెసేజెస్ వాడకం ఎక్కువ అలవాటు ఉంటుంది. దీంతో వీళ్లు షార్ట్‌కట్ పదాలు, చాట్ భాష అంటే B4, BTW, LOL, & లాంటి పదాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు వివిధ అధ్యయనాల్లో ఇప్పటికే తేలింది. వేగంగా ఆలోచించడం, త్వరగా స్పందించడం, కలంతో రాయడంకంటే టైపింగ్‌కు అలవాటు పడటంతో జెన్-జీ విద్యార్థులు పరీక్షల్లో కూడా చాట్ స్టైల్‌లో సమాధానాలు రాస్తున్నారని అధ్యాపకులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




