KVS TGT Jobs 2026: కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ ఉద్యోగాలకు కేంద్ర విద్యా శాఖ ఆమోదం.. త్వరలోనే నోటిఫికేషన్
కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) 2026- 27 విద్యా సంవత్సరానికి గానూ ఖాళీగా ఉన్న స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ తర్వలోనే విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 987 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్..

హైదరాబాద్, జనవరి 26: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) 2026- 27 విద్యా సంవత్సరానికి గానూ ఖాళీగా ఉన్న స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ తర్వలోనే విడుదల కానుంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 987 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో స్పెషల్ ఎడ్యుకేటర్స్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT) పోస్టులు 493, స్పెషల్ ఎడ్యుకేటర్స్ ప్రైమరీ టీచర్స్ (PRT) పోస్టులు 494 వరకు ఉన్నాయి. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ తాజాగా ప్రకటన వెలువరించింది. ఈ పోస్టుల భర్తీకి కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ నియామక ప్రక్రియకు ఆమోదం కూడా తెలిపినట్లు కేంద్రీయ విద్యాలయ రీజినల్ కార్యాలయాల నివేదిక వెల్లడించింది. ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పోస్టుల వివరాలు, అర్హత ప్రమాణాలు, రాష్ట్రాల వారీగా ఉన్న ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర వివరాలు తెలుసుకోవచ్చు.
కేంద్రీయ విద్యాలయాల్లో నియామకాలకు సంబంధించి పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
TGT అర్హత ప్రమాణాలు
- 50 శాతం కనీస అర్హతతో గ్రాడ్యుయేషన్
- స్పెషల్ లేదా జనరల్‌లో బి.ఎడ్ డిగ్రీ
- ప్రత్యేక విద్యలో డిప్లొమా
- CTET పేపర్ 2 అర్హత
- భారత పునరావాస మండలితో చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్
- గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు
- PRT అర్హత ప్రమాణాలు
- గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50 శాతం మార్కులతో సీనియర్ సెకండరీ (తరగతి 12) అర్హత
- డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్
- CTET పేపర్ 1 అర్హత
- హిందీ, ఇంగ్లీష్ బోధించే సామర్థ్యం
- గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.




