కుడి లేదా ఎడమ..రాత్రుళ్లు ఏ పక్కకు తిరిగి పడుకుంటే మంచిది..?
నేటి సమాజంలో చాలా మందికి నిద్రలేమి సమస్య వేధిస్తోంది. శరీరం, మెదడు విశ్రాంతికి నిద్ర అత్యవసరం. మంచి నిద్ర కోసం సరైన పడుకునే భంగిమను ఎంచుకోవడం కీలకం. సాధారణంగా ఎడమ వైపు తిరిగి పడుకోవడం ప్రశాంతతను, శ్వాస సులభతరాన్ని అందిస్తుంది. అయితే, గుండె రోగులు కుడి వైపు తిరిగి పడుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి, గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన నిద్రకు ఈ చిట్కాలు పాటించండి.

నిద్ర.. అనేది ఆ సమయంలో మన శరీరాన్ని మరమ్మత్తు చేస్తుంది. దీనివల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. కనీ, ఈ రోజుల్లో చాలా మంది రాత్రి నిద్ర పట్టడం లేదని లేదా తరచుగా నిద్ర చెదిరిపోతుందని ఇబ్బంది పడతారు. కాబట్టి మంచి నిద్ర కోసం నిద్రించే స్థానాన్ని జాగ్రత్తగా ఎంచుకోవడం ముఖ్యం. తద్వారా మీకు మంచి నిద్ర వస్తుంది. నిద్రించడానికి ఒక వైపు తిరిగి పడుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇది మీ మనస్సును రిలాక్స్ గా ఉంచుతుంది. మరి ఏ వైపు తిరిగి పడుకుంటే మంచి నిద్ర వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వైద్యుల ప్రకారం.. మీరు గర్భవతిగా ఉన్నా లేకున్నా.. ఎడమ వైపు తిరిగి పడుకోవడం మంచిదిగా చెప్తారు. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, శ్వాస తీసుకోవడం సులభం అవుతుందని నమ్ముతారు. అయితే గుండె రోగుల విషయానికి వస్తే వారు కుడి వైపు తిరిగి పడుకోవాలి. వారి గుండె మీద తక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇది గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది.
అంతేకాదు.. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణాశయంలోని యాసిడ్స్ అన్నీ సక్రమంగా పనిచేస్తాయి. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అదే కుడివైపు తిరిగి పడుకుంటే, ఈ యాసిడ్స్ అన్నీ పైకి ఎగదన్నుతాయని నిపుణులు చెబుతున్నారు. . అందుకే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలు ఉన్నవాళ్లు ఎడమ వైపు తిరిగి పడుకోవాలని సూచిస్తున్నారు. వెన్నెముక సమస్యలు ఉన్నవారు ఎడమవైపు తిరిగి పడుకుంటే ఉపశమనం కలుగుతుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




