ప్రియుడిపై కోపంతో అతని ఇంటిని ప్రియురాలు తగలబెట్టిన ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం మద్దపల్లి గ్రామంలో ప్రియుడు గత కొన్ని రోజులుగా ప్రియురాలని పట్టించుకోవడం లేదు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. కోపంతో రగిలిపోయిన ప్రియురాలు ప్రియుడి ఇంటికి నిప్పు పెట్టింది. ఈ ఘటనలో ప్రియుడు, అతడి భార్య, కుమారుడితో సహా మరో పది మందికి గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.