లీటర్ పెట్రోల్ కేవలం రూ.50?! అసలు మ్యాటర్ తెలిస్తే ఫిదా కావాల్సిందే!
తమిళనాడులోని తంజావూరు జిల్లా ఆడుతురైలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ యజమాని అద్భుతమైన ఆఫర్ ప్రకటించారు. హెల్మెట్ ధరించి వచ్చే ద్విచక్ర వాహనదారులకు గంటపాటు లీటర్ పెట్రోల్ కేవలం ₹50కే అందించారు. సాధారణంగా పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో, ఈ ప్రత్యేక ఆఫర్ స్థానికులకు ఎంతో ఆనందాన్నిచ్చింది. 500 మందికి పైగా ఈ చౌక పెట్రోల్ కోసం క్యూ కట్టారు.

Petrol Price: దేశంలో పెట్రోల్, డిజీల్ ధరలు సామాన్యుల నడ్డివిరుస్తున్నాయి. లీటర్ పెట్రోల్ ధర ఎప్పుడో సెంచర్ కొట్టేసింది. దీంతో ఇటీవల కాలంలో చాలా మంది ఎలక్ట్రిక్ వెహికిల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ బైక్‌లు వాడుతున్న మాత్రం బంక్ వైపు వెళ్లాలంటేనే దడుసుకుంటున్నారు. అయితే, దేశంలోని ఒక రాష్ట్రంలో మాత్రం లీటర్ పెట్రోల్ కేవలం 50 రూపాయలకే లభిస్తుందనే విషయం తెలుసా…?
అవును మీరు విన్నది నిజమే.. దేశవ్యాప్తంగా భగ్గుమంటున్న పెట్రోల్ ధర అక్కడ మాత్రం కేవలం 50 రూపాయలకే లీటర్ చొప్పున ట్యాంక్ ఫుల్ చేసుకుంటున్నారు. గణతంత్ర దినోత్సవానికి ముందు తమిళనాడులో ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. తంజావూరు జిల్లాలోని కుంభకోణం సమీపంలోని ఆడుతురైలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ యజమాని మోహనసుందరం ఈరోజు (జనవరి 26) ఉదయం 9.30 గంటల నుండి 10.30 గంటల మధ్య హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడిపే ఎవరికైనా లీటరుకు రూ.50 చొప్పున పెట్రోల్ ఇస్తామని ప్రకటించారు.
అదేవిధంగా, ఈ ఉదయం 9.30 గంటలకే 500 మందికి పైగా హెల్మెట్లు ధరించి పెట్రోల్ నింపుకోవడానికి టూవీలర్లు వేసుకుని క్యూ కట్టారు. బంక్‌ముందు పొడవైన క్యూలో వాహనదారులు నిలబడ్డారు. పెట్రోల్ పోయించుకున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా అందరికీ మొక్కలు పంపిణీ చేశారు. దీనితో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది. తదనంతరం, పోలీసు శాఖ కూడా భద్రతా ఏర్పాట్లు చేసింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




