AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తన హెల్తీ హెయిర్ సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ హీరోయిన్..! చిన్న టిప్‌తో ఎన్ని లాభాలో

గ్లామర్ ప్రపంచంలో మెరిసిపోయే భామలకు జుట్టు అనేది ఒక పెద్ద ఆస్తి. రంగురంగుల లైట్లు, రకరకాల హెయిర్ స్టైల్స్, కెమికల్స్‌తో కూడిన ప్రొడక్ట్స్ మధ్య తమ జుట్టును కాపాడుకోవడం వారికి పెద్ద సవాల్. ముఖ్యంగా నిరంతరం షూటింగ్స్, ప్రయాణాల్లో ఉండే ఆ స్టార్ హీరోయిన్ తన జుట్టును ఇంత ఆరోగ్యంగా, నల్లగా ఎలా ఉంచుకోగలుగుతోంది?

తన హెల్తీ హెయిర్ సీక్రెట్ రివీల్ చేసిన స్టార్ హీరోయిన్..! చిన్న టిప్‌తో ఎన్ని లాభాలో
Heroine1
Nikhil
|

Updated on: Jan 27, 2026 | 8:12 AM

Share

ఖరీదైన సెలూన్లకు వెళ్తుందా లేక విదేశీ సీరమ్స్ వాడుతుందా అని అందరూ అనుకుంటుంటారు. కానీ ఆ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన హెయిర్ కేర్ సీక్రెట్ బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. మనం ఇంట్లో వాడే అతి సాధారణమైన నూనెలే తన జుట్టుకు రక్షక కవచాలని ఆమె చెబుతోంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. శ్రుతీ హాసన్. ఆమె పాటిస్తున్న ఆ సింపుల్ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం..

నూనెతోనే జుట్టుకు రక్షణ..

సాధారణంగా నూనె రాసుకుంటే జుట్టు జిడ్డుగా ఉంటుందని చాలామంది యువతులు దూరంగా పెడుతుంటారు. కానీ శ్రుతీ హాసన్ మాత్రం నూనె రాసుకోవడాన్నే తన ప్రధాన హెయిర్ కేర్ సీక్రెట్‌గా చెబుతోంది. “సినిమా షూటింగ్స్ సమయంలో రకరకాల హెయిర్ ప్రాసెస్ చేయడం వల్ల జుట్టు చాలా దెబ్బతింటుంది. విపరీతంగా జుట్టు ఊడిపోతుంది. అటువంటప్పుడు నూనె మాత్రమే నా జుట్టును కాపాడుతోంది” అని ఆమె వెల్లడించింది.

శ్రుతీ హాసన్ కేవలం ఒకే రకమైన నూనె కాకుండా మూడు రకాల నూనెలను కలిపి వాడుతుందట. ఆమె చెప్పిన దాని ప్రకారం ఆ మిశ్రమంలో నువ్వుల నూనె, కొబ్బరి నూనె, బాదం నూనె ఉంటాయి.

  1. నువ్వుల నూనె: ఇది జుట్టుకు పోషణను ఇస్తుంది.
  2. కొబ్బరి నూనె: జుట్టు మృదువుగా ఉండటానికి సహాయపడుతుంది.
  3. బాదం నూనె: జుట్టుకు కావాల్సిన విటమిన్లను అందించి దృఢంగా మారుస్తుంది.

రెగ్యులర్ ప్రాసెస్ వల్ల కలిగే నష్టం..

హీరోయిన్లకు ప్రతిరోజూ జుట్టుకు హీటింగ్ మిషన్లు వాడటం, రకరకాల స్ప్రేలు కొట్టడం తప్పనిసరి. దీనివల్ల జుట్టు తన సహజత్వాన్ని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. శ్రుతీ హాసన్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొన్నట్లు చెప్పింది. జుట్టు ఎక్కువగా రాలిపోతున్నప్పుడు ఆమె మళ్ళీ మన సంప్రదాయ పద్ధతి అయిన నూనె పట్టించడాన్నే నమ్ముకుంది. వారానికి కనీసం రెండు మూడు సార్లు నూనెతో తలకు మసాజ్ చేసుకోవడం వల్ల స్కాల్ప్ ఆరోగ్యంగా ఉంటుందని ఆమె సూచిస్తోంది.

Shruthi Haasan

Shruthi Haasan

ఖరీదైన ట్రీట్‌మెంట్లు తీసుకోలేక జుట్టు సమస్యలతో బాధపడేవారికి శ్రుతీ హాసన్ చెప్పిన ఈ చిట్కా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మన ఇంట్లో దొరికే నువ్వుల నూనె, కొబ్బరి నూనె జుట్టుకు అద్భుతమైన పోషణను ఇస్తాయి. నూనె రాసుకోవడం వల్ల జుట్టుకు తేమ అందుతుంది, చిక్కులు పడకుండా ఉంటుంది. నేటి తరం యువత కూడా కెమికల్ షాంపూలు, కండీషనర్ల కంటే ఇలాంటి సహజమైన పద్ధతులపై దృష్టి పెట్టాలని శ్రుతీ హాసన్ మాటలు గుర్తు చేస్తున్నాయి. అందంగా కనిపించడం కోసం వాడే కృత్రిమ పద్ధతుల కంటే, సహజమైన నూనెలతో జుట్టును సంరక్షించుకోవడం ఉత్తమమని శ్రుతీ హాసన్ నిరూపించింది.