Watch Video: వరుస ప్రమాదాలు.. రోడ్డు డివైడర్‌ను ఢీకొన్న మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు! ఆ తర్వాత..
కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నంద్యాల సిరివెళ్ల దగ్గర వీఆర్బిసివిఆర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. రోడ్డు డివైడర్ ని దాటి పక్క రోడ్డులోకి వెళ్లి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొనడంతో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. మొత్తం ముగ్గురు మంటల్లో కాలిపోయి సజీవ దహనం అయ్యారు. ఈ వరుస ఘటనలు మరువక ముందే తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది..

కర్నూలు, జనవరి 27: ఇటీవలప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురి అయింది. అయితే అదృష్టవశాత్తు ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరో వాహనంలో ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు యాజమాన్యం చేర్చింది. కర్నూలు శివారులోని చిన్నటేకూరు వద్ద జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నంద్యాల సిరివెళ్ల దగ్గర వీఆర్బిసివిఆర్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. రోడ్డు డివైడర్ ని దాటి పక్క రోడ్డులోకి వెళ్లి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొనడంతో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. మొత్తం ముగ్గురు మంటల్లో కాలిపోయి సజీవ దహనం అయ్యారు. ఈ వరుస ఘటనలు మరువక ముందే తాజాగా మరో దారుణం చోటు చేసుకుంది.
తాజాగా కావేరీ ట్రావెల్స్ బస్సు జగన్నాథ గట్టు దగ్గర రోడ్డు డివైడర్‌ను దాటి అవతలి రోడ్డు పైకి వెళ్ళింది. అదృష్టవశాత్తు అవతలి రోడ్డులో అదే సమయంలో మరో వాహనం రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రయాణికులను మరో బస్సులో పంపించారు. పాండిచ్చేరి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. పోలీసులు రవాణా ఇతర శాఖల అధికారులు పరిశీలించి నివేదిక తయారు చేస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వరుస ప్రమాదాలకు గురవుతుండటం వారిలో ఆందోళనకు గురిచేస్తుంది. మంత్రి ఫరూక్ టీవీ9 తో చెప్పినట్లుగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించడం మంచిదేమో అనిపిస్తుంది. అయితే ప్రయాణికులు ఏ బస్సులో ప్రయాణించాలనేది పూర్తిగా వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




