AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్త హత్య.. ప్రియుడితోపాటు భార్య అరెస్ట్‌!

చిలువూరు గ్రామానికి చెందిన లోకం శివ నాగరాజు (48)కి 2008లో లక్ష్మీ మాధురితో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు. శివ నాగరాజు ఉల్లి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఇటీవల అతడికి వ్యాపారంతోపాటు షేర్‌ మార్కెట్లో నష్టాలు వచ్చాయి. దీంతో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి. కుటుంబ పోషణ కోసం భార్య..

బిర్యానీలో నిద్రమాత్రలు కలిపి భర్త హత్య.. ప్రియుడితోపాటు భార్య అరెస్ట్‌!
Duggirala Husband Murder Case
Srilakshmi C
|

Updated on: Jan 27, 2026 | 6:36 AM

Share

దుగ్గిరాల, జనవరి 27: బిర్యానీలో నిద్ర మాత్రలు కలిపి భర్తకు ప్రేమగా ఒడ్డించింది ఓ ఇల్లాలు. ఆనక భర్త మత్తులోకి జారుకోవడంతో ప్రియుడితో కలిసి భర్తను చంపింది. ఈ దారుణ ఘటన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో చోటు చేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు భార్యను అందుకు సహకరించిన ప్రియుడిని, ఆర్‌ఎంపీని అరెస్ట్ చేసి.. కటకటాల్లో వేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపిన వివరాల ప్రకారం..

దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన లోకం శివ నాగరాజు (48)కి 2008లో లక్ష్మీ మాధురితో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు. శివ నాగరాజు ఉల్లి వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఇటీవల అతడికి వ్యాపారంతోపాటు షేర్‌ మార్కెట్లో నష్టాలు వచ్చాయి. దీంతో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తాయి. కుటుంబ పోషణ కోసం భార్య లక్ష్మీ మాధురి సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా చేరింది. అనంతరం విజయవాడలోని ఓ సినిమా థియేటర్‌లో పనికి కుదిరింది. అక్కడ బుకింగ్‌ కౌంటర్‌లో పనిచేసే పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన కొండవీటి గోపీతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. అనంతరం గోపీని భర్తకు పరిచయం చేసింది. దీంతో వారిద్దరూ స్నేహితులుగా మారారు. గోపీ సాయంతో హైదరాబాద్‌లో కొన్నాళ్లు డ్రైవర్‌గా పనిచేసిన శివనాగరాజు ఆ తర్వాత కొలువు మానేశాడు. ఈ క్రమంలో గోపీకి, భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించాడు. ఇటీవల దుగ్గిరాల వచ్చిన గోపీ భార్య, పిల్లలతో గోపీ ఓ ఫ్లాట్‌లో ఉంటున్నట్లు పలుమార్లు హెచ్చరించాడు.

దీంతో శివనాగరాజు అడ్డు తొలగించుకోవాలని లక్ష్మీమాధురి, గోపీ పథకం పన్నారు. గోపీ స్నేహితుడు ఆర్‌ఎంపీ కంభంపాటి సురేష్‌ వద్ద నిద్రమాత్రలు తీసుకుని వాటిని మాధురికి ఇచ్చాడు. ఆమె వాటిని పొడి చేసి బిర్యానీలో కలిపి జనవరి 18న భర్తకు పెట్టింది. బిర్యానీ తిన్న అనంతరం నిద్రమత్తులోకి వెళ్లిన శివనాగరాజు ఛాతిపై గోపీ కూర్చుని అప్పడాల కర్రతో కొట్టి చంపారు. మరుసటి రోజు శివనాగరాజు నిద్రలో చనిపోయినట్లు మాధురి నాటకాలు మొదలు పెట్టింది. అనుమానాస్పద మృతిపై కేసు నమోదైంది. అతడి మృతదేహంపై ఎలాంటి గాయాలూ లేవు. కానీ ఛాతీ ఎముకలు విరిగినట్లు పోస్టుమార్టంలో తేలడంతో పోలీసులు మాధురిని తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు కథ బయటపడిందని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ మీడియాకు తెలిపారు. నిందితులు గోపీ, లక్ష్మీ మాధురి, సురేశ్‌లను అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.