AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRB Railway Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట.. రైల్వేలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? మరో 2 రోజులే ఛాన్స్‌

రైల్వే రీజియన్లలో 2025 సంవత్సరానికి సంబంధించి ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిఫికేన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, సీనియర్‌ పబ్లిసిటీ న్‌స్పెక్టర్‌, స్టాఫ్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ ట్రైనింగ్..

RRB Railway Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట.. రైల్వేలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? మరో 2 రోజులే ఛాన్స్‌
RRB Railway Isolated Categories jobs
Srilakshmi C
|

Updated on: Jan 27, 2026 | 7:42 AM

Share

దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో 2025 సంవత్సరానికి సంబంధించి ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టులకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నోటిఫికేన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌ కింద చీఫ్ లా అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, సీనియర్‌ పబ్లిసిటీ న్‌స్పెక్టర్‌, స్టాఫ్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ ట్రైనింగ్ తదితర మొత్తం 312 పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలవగా.. మరో రెండు రోజుల్లో అప్లికేషన్లు ముగియనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు జనవరి 29, 2026వ తేదీ రాత్రి 11.59 గంటలలోగా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది.

పోస్టు వివరాలు..

  • చీఫ్ లా అసిస్టెంట్ పోస్టుల సంఖ్య: 22
  • పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల సంఖ్య: 07
  • జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌ పోస్టుల సంఖ్య: 202
  • సీనియర్‌ పబ్లిసిటీ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల సంఖ్య: 15
  • స్టాఫ్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల సంఖ్య: 24
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌/ ట్రైనింగ్‌ పోస్టుల సంఖ్య: 02
  • ల్యాబ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌-3 పోస్టుల సంఖ్య: 39
  • సైంటిఫిక్‌ సూపర్వైజర్‌/ఎర్గోనామిక్స్ అండ్‌ ట్రైనింగ్‌ పోస్టుల సంఖ్య: 01

ఈ పోస్టులను అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్‌పూర్, కోల్‌కతా, ముంబయి, పట్నా, ప్రయాగ్‌రాజ్.. ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్‌, లా డిగ్రీ, సంబంధిత విభాగాల్లో డిప్లొమా, పీజీ డిప్లొమా, ఎంబీఏ, మాస్టర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/ ఈబీసీ/ మైనారిటీ అభ్యర్థులు రూ.250 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. సింగిల్‌ స్టేజ్‌ సీబీటీ, ట్రాన్స్‌లేషన్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ల్యాబ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు రూ.19,000, జూనియర్‌ ట్రాన్స్‌లేటర్‌, ఇన్‌స్పెక్టర్స్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్ పోస్టులకు రూ.35,400, ఇతర పోస్టులకు రూ.44,900 చొప్పున జీతంగా చెల్లిస్తారు.

ఆర్‌ఆర్‌బీ అధికారిక నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

రైల్వేలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? మరో 2 రోజులే ఛాన్స్‌
రైల్వేలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? మరో 2 రోజులే ఛాన్స్‌
రివెంజ్ అంటే కోపం కాదు, సక్సెస్ అని నిరూపించిన స్టార్ హీరో!
రివెంజ్ అంటే కోపం కాదు, సక్సెస్ అని నిరూపించిన స్టార్ హీరో!
శ్రీకాంత్ ఓదెల మాస్టర్ ప్లాన్..‘కిల్’ స్టార్ బాక్సాఫీస్ హంగామా
శ్రీకాంత్ ఓదెల మాస్టర్ ప్లాన్..‘కిల్’ స్టార్ బాక్సాఫీస్ హంగామా
టీ20 వరల్డ్ కప్‌లో కొత్త డ్రామాకు తెరలేపిన పాక్
టీ20 వరల్డ్ కప్‌లో కొత్త డ్రామాకు తెరలేపిన పాక్
ప్రపంచ స్థాయికి మేడారం జాతర.. ఇదే ఉదాహరణ..!
ప్రపంచ స్థాయికి మేడారం జాతర.. ఇదే ఉదాహరణ..!
బిగ్‌ అలర్ట్‌.. ఈ మార్గంలో ఫిబ్రవరి 14 వరకు అనేక రైళ్లు రద్దు..
బిగ్‌ అలర్ట్‌.. ఈ మార్గంలో ఫిబ్రవరి 14 వరకు అనేక రైళ్లు రద్దు..
బంగ్లా క్రికెట్‎లో మంటలు..అటు సీనియర్ల రచ్చ, ఇటు జూనియర్లు తుస్సు
బంగ్లా క్రికెట్‎లో మంటలు..అటు సీనియర్ల రచ్చ, ఇటు జూనియర్లు తుస్సు
నిరుద్యోగులకు అలర్ట్.. వచ్చే 3 నెలల్లో ఆ ఉద్యోగ నియామకాలకు ప్రకటన
నిరుద్యోగులకు అలర్ట్.. వచ్చే 3 నెలల్లో ఆ ఉద్యోగ నియామకాలకు ప్రకటన
2 ఏళ్ల క్రితం అరంగేట్రం.. ఓవర్ యాక్షన్‌తో ఔట్.. కట్‌చేస్తే..
2 ఏళ్ల క్రితం అరంగేట్రం.. ఓవర్ యాక్షన్‌తో ఔట్.. కట్‌చేస్తే..
BSNL రోజుకు కేవలం 7 రూపాయలకే 2.6GB డేటా, అపరిమిత కాలింగ్‌..
BSNL రోజుకు కేవలం 7 రూపాయలకే 2.6GB డేటా, అపరిమిత కాలింగ్‌..