AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG Govt Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్.. వచ్చే 3 నెలల్లో ఆ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌

రాష్ట్రంలో కొత్త ఏడాదిలో నిర్ణీత సమయంలోనే ఉద్యోగ నియామకాలు పూర్తిచేస్తామని టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం నాంపల్లిలోని కమిషన్‌ కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకే పరీక్షతో..

TG Govt Jobs 2026: నిరుద్యోగులకు అలర్ట్.. వచ్చే 3 నెలల్లో ఆ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌
crucial update on TGPSC Jobs
Srilakshmi C
|

Updated on: Jan 27, 2026 | 6:57 AM

Share

హైదరాబాద్‌, జనవరి 27: తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఏడాదిలో నిర్ణీత సమయంలోనే ఉద్యోగ నియామకాలు పూర్తిచేస్తామని టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం నాంపల్లిలోని కమిషన్‌ కార్యాలయంలో ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకే పరీక్షతో పూర్తయ్యే నియామకాలను మూడు నెలల్లోపు, మల్టిపుల్‌ పరీక్షలున్నాయన్నారు. వీటిని వచ్చే ఆరునెలల్లో భర్తీ చేస్తామని తెలిపారు. ఇక నుంచి ఉద్యోగ నియామకాలు నిర్ణీత గడువులోనే పూర్తి చేస్తామని తెలిపారు.

నీట్‌ పీజీ దివ్యాంగ అభ్యర్థులకు వైకల్య పరీక్షలు.. షెడ్యూల్‌ ఇదే

ఇటీవల కేంద్రం నీట్‌ పీజీ కటాఫ్‌ మార్కులు గణనీయంగా తగ్గించిన సంగతి తెలిసిందే. 2025-26 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌లోని కన్వీనర్‌ కోటా సీట్లకు దివ్యాంగుల కేటగిరీలో అర్హత సాధించి, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మెడికల్‌ బోర్డు ఎదుట హాజరుకావాలని డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ రాధికారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

మెరిట్‌ ర్యాంకు 1 నుంచి 14 వరకు వచ్చిన వారు జనవరి 29న ఉదయం 10 గంటలకు హాజరుకావాలి. 15 నుంచి 28 మధ్య ర్యాంకర్లు జనవరి 30న ఉదయం 10 గంటలకు మెడికల్‌ బోర్డు ఎదుట హాజరు కావాలని తెలిపారు. అభ్యర్థుల పేర్లను ఇప్పటికే వర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అభ్యర్ధులు ఆయా తేదీల్లో దివ్యాంగ ధ్రువీకరణ పత్రాలతో పాటు విద్యా సంబంధిత సర్టిఫికట్లను తమతోపాటు తీసుకురావాలని సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.