ప్రేమ విషయాన్ని బయటపెట్టిన అనుష్క.. జీవితంలోనే అందమైన జ్ఞాపకం..

Rajitha Chanti

Pic credit - Instagram

26 January 2026

అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంది.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా సినీప్రియులకు దేవసేనగా దగ్గరైంది. అందంతోపాటు అభినయంతో కోట్లాది సినీప్రియుల హృదయాలు గెలుచుకుంది. 

అయితే బాహుబలి తర్వాత సినిమాలు తగ్గించేసింది. కొన్నాళ్లు సైలెంట్ అయిన అనుష్క.. ఆ తర్వాత అప్పుడప్పుడు ఒక్కో సినిమా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. 

ఇటీవలే ఘాటి సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

ఇటీవల తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. 6వ తరగతిలోనే తనకు లవ్ ప్రపోజల్ వచ్చిందని అప్పుడు ఐ లవ్ వ్యూ మాటకు అర్థం తెలియదని చెప్పింది.

ఒకబ్బాయి లవ్ వ్యూ చెప్పడంతో తాను కూడా సరే అన్నానని గుర్తుచేసుకుంది. ఆ వయసులో సరే అన్నానని.. అది జీవితంలో అందమైన జ్ఞాపకమని తెలిపింది.

ప్రస్తుతం అనుష్క శెట్టి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో వైరలవుతున్నాయి. ఘాటి సినిమా తర్వాత అనుహ్యంగా సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటుంది.

ప్రస్తుతం అనుష్క చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటూ ఫ్యామిలీతో గడుపుతుంది స్వీటీ.