ఆ హీరో నా కాలేజీ ఫ్రెండ్.. ఇంత పెద్ద స్టార్ అవుతాడనుకోలేదు.. త్రిష..
Rajitha Chanti
Pic credit - Instagram
26 January 2026
దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న హీరోయిన్ త్రిష. ప్రస్తుతం 41 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో అలరిస్తుంది.
ఇప్పటికీ ఏమాత్రం తగ్గని అందం, అభినయంతో అలరిస్తుంది. తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తుంది. సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాణిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఇదిలా ఉంటే.. తెలుగులో సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు తన కాలేజీ ఫ్రెండ్ అని తెలిపింది. చెన్నైలో ఇద్దరం ఒకే కాలేజీ అని చెప్పుకొచ్చింది.
ఇద్దరం యాక్టర్స్ అవుతామని అసలు అనుకోలేదని.. అప్పట్లో ఇద్దరి మధ్య హాయ్, బాయ్ అనే ఫ్రెండ్షిప్ మాత్రమే ఉండేదని కాలేజీ రోజులు గుర్తుచేసుకుంది.
ప్రస్తుతం తనకు ఇష్టమైన హీరోలలో మహేష్ బాబు ఒకరని తెలిపింది. త్రిష, మహేష్ బాబు ఇద్దరూ కలిసి నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద హిట్టయ్యాయి.
సైనికుడు, అతడు వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాదు మహేష్, త్రిష జోడికి దక్షిణాదిలో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందటే అతిశయోక్తి కాదు.
ప్రస్తుతం మహేష్ వారణాసి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే త్రిష తెలుగు, తమిళం భాషలలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్