IAS Officer: కోర్టు ‘కళ్ళు’ కప్పలేకపోయాడు..ప్రమోషన్ కొట్టేసినా.. చిక్కుల్లో పడి ఆ ఐఏఎస్ అధికారి అరెస్టయ్యాడు..ఎక్కడంటే ?
మధ్యప్రదేశ్ లో ఓ ఐఏఎస్ అధికారి తను ఊహించని చిక్కుల్లో పడ్డాడు. సంతోష్ వర్మ అనే ఆ అధికారి ఉదంతంలోకి వెళ్తే..అయిదేళ్ల క్రితం ఓ మహిళ తనపై పెట్టిన కేసులో తనను స్థానిక కోర్టు నిర్దోషిగా వదిలివేసిందంటూ రెండు కోర్టు ఉత్తర్వులను ఫోర్జరీ చేశాడీయన. వీటి ఆధారంగా భోపాల్ లోని...
మధ్యప్రదేశ్ లో ఓ ఐఏఎస్ అధికారి తను ఊహించని చిక్కుల్లో పడ్డాడు. సంతోష్ వర్మ అనే ఆ అధికారి ఉదంతంలోకి వెళ్తే..అయిదేళ్ల క్రితం ఓ మహిళ తనపై పెట్టిన కేసులో తనను స్థానిక కోర్టు నిర్దోషిగా వదిలివేసిందంటూ రెండు కోర్టు ఉత్తర్వులను ఫోర్జరీ చేశాడీయన. వీటి ఆధారంగా భోపాల్ లోని ఓ ప్రభుత్వ శాఖలో అదనపు కమిషనర్ గా ప్రమోషన్ కొట్టేశాడు. కానీ ఛీటింగ్ ఎంతోకాలం దాగదు. గత నెల 27 న ఈ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది. ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ విజేంద్ర సింగ్ రావత్ ఇండోర్ లో ఓ కేసును విచారిస్తుండగా తన కోర్టులో కొన్ని ఉత్తర్వుల విషయంలో ఏదో ‘గోల్ మాల్’ జరిగినట్టు గుర్తించారు. తన ఆర్డర్స్ ని ఎవరైనా ఫోర్జరీ చేశారేమో అన్న అనుమానంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో మొదట రెండు ఉత్తర్వులను ఫోర్జరీ చేశారన్న విషయం బయటపడింది. దాంతో వారు ఆరా తీస్తే ఈ ఐఏఎస్ అధికారి నిర్వాకం తెలిసిపోయింది. ఐపీసీ లోని వివిధ సెక్షన్ల కింద వారు కేసు నమోదు చేసి ఈయనను అరెస్టు చేశారు. అసలు ఈ (నకిలీ) ఉత్తర్వులు జారీ అయినట్టు చెబుతున్న తేదీల్లో మేజిస్ట్రేట్ రావత్ సెలవులో ఉన్నట్టు తెలిసింది. గత శనివారం ఖాకీలో సంతోష్ వర్మను పిలిపించి విచారించారు.
లభించిన ఆధారాలను బట్టి ఈ వ్యవహారంలో ఈయన జోక్యం ఉందని నిర్ధారించారు. దీంతో వర్మను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా కోర్టు ఈయనను 14 వరకు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. 2016 లో వర్మ తనపై దాడి చేశాడని, దుర్భాషలాడాడని, తనను బెదిరించాడని ఆరోపిస్తూ ఓ మహిళ ఇండోర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసు ఇప్పుడిలా ఈయన మెడకు చుట్టుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి : మెస్సి మెస్మరైజ్ చేసావ్…28ఏళ్ల నిరీక్షణకు తెరదించావ్..!కోపా అమెరికా కప్ కైవసం..:Copa America Final 2021