ఆమె ఉగ్రవాది కాదు..బాధితురాలే ! అయినా ఆ టీచర్ ను అకారణంగా తొలగించారు
జమ్మూ కాశ్మీర్ లో అసలు ఉగ్రవాద కార్యకలాపాలతో ఏ మాత్రం సంబందం లేని ఓ టీచర్ ని ప్రభుత్వం తొలగించింది. అనంతనాగ్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న రజియా సుల్తానా అనే ఈ మహిళను అధికారులు డిస్మిస్ చేశారు. దాదాపు 20 ఏళ్లుగా ఈమె ఇక్కడ టీచర్ గా ఉంది.
జమ్మూ కాశ్మీర్ లో అసలు ఉగ్రవాద కార్యకలాపాలతో ఏ మాత్రం సంబందం లేని ఓ టీచర్ ని ప్రభుత్వం తొలగించింది. అనంతనాగ్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న రజియా సుల్తానా అనే ఈ మహిళను అధికారులు డిస్మిస్ చేశారు. దాదాపు 20 ఏళ్లుగా ఈమె ఇక్కడ టీచర్ గా ఉంది. 1096 లో ఈమె తండ్రిని గుర్తు తెలియని ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి హతమార్చారు. అప్పట్లో కారుణ్య నియామకాలు జరిగేవి. అదే సూత్రంపై 2000 సంవత్సరంలో రజియాను టీచర్ గా అప్పటి ప్రభుత్వం నియమించింది. ఈమె తండ్రి సుల్తాన్ భట్ నాడు జమాత్ ఇస్లామీ సభ్యుడని, 1997 లో జరిగిన ఎన్నికల్లో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ తరఫున పోటీ చేశాడని తెలిసింది. అయితే ఆ ఎన్నికల్లో పోటీ చేయవద్దని ఉగ్రవాదులు హెచ్చరించినా ఆయన వినలేదని తెలియవచ్చింది. ఫలితంగా వారు ఆయనను అపహరించుకుపోయి హత్య చేశారు. ఇలాంటి కేసుల్లో బాధితులకు కారుణ్య నియామకాల కింద ప్రభుత్వం జాబ్స్ ఇచ్చేది. ఆ క్రమంలో రజియా కూడా టీచర్ ఉద్యోగం సంపాదించింది. అయితే ఆమెకు ఎలాంటి టెర్రరిస్టు కార్యకలాపాలతో సంబంధం లేదు,
కానీ ఏ కారణం లేకుండానే తనను తొలగించినట్టు ఉత్తర్వులు వచ్చాయని రజియా సుల్తానా తెలిపింది. అసలు నామీద ఎలాంటి ఎంక్వయిరీ కూడా వేయలేదు.. నా వాదన వినలేదు.. కానీ ఇప్పుడు ఎందుకిలా డిస్మిస్ చేశారన్నది తెలియకుండా ఉంది.. దయచేసి కారణం చెప్పాలని , తన వాదన వినాలని ఈ బాధితురాలు కోరుతోంది. ప్రభుత్వం తొలగించిన 11 మంది ఉద్యోగుల్లో ఈమె కూడా ఒకరు. ఉగ్రవాదుల కుమారులను ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టు నిన్న ఓ ప్రకటన జారీ అయింది. సయ్యద్ సలావుద్దీన్ అనే టెర్రరిస్టు కుమారులైన ఇద్దరిని తొలగించిన విషయం గమనార్హం.
మరిన్ని ఇక్కడ చూడండి : మెస్సి మెస్మరైజ్ చేసావ్…28ఏళ్ల నిరీక్షణకు తెరదించావ్..!కోపా అమెరికా కప్ కైవసం..:Copa America Final 2021