AP-Odisha Kotiya war: ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల మధ్య కొటియా యుద్ధం.. ఎందుకు జరుగుతోంది.. ఎవరు రాజేస్తున్నారు..

ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ఓ వివాదం దశాబ్ధాలుగా నానుతోంది. ఒకప్పుడంటే ఓకే అనుకోవచ్చు.. ఇంతగా సాంకేతిక పరిఙ్ఞానం పెరిగిపోయిన రోజుల్లో కూడా ఓ చిన్న వివాదం తెగకపోవడం ఒకింత..

AP-Odisha Kotiya war: ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల మధ్య కొటియా యుద్ధం.. ఎందుకు జరుగుతోంది.. ఎవరు రాజేస్తున్నారు..
Kotia Cluster
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 12, 2021 | 11:38 AM

ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ఓ వివాదం దశాబ్ధాలుగా నానుతోంది. ఒకప్పుడంటే ఓకే అనుకోవచ్చు.. ఇంతగా సాంకేతిక పరిఙ్ఞానం పెరిగిపోయిన రోజుల్లో కూడా ఓ చిన్న వివాదం తెగకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు. ఆ గ్రామాలు తమవంటే తమవని రెండు రాష్ట్రాలు వాదించుకుంటున్నాయి. ఫలితంగా రెండు ప్రభుత్వాలు అక్కడ తమ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. ఆంధ్ర-ఒడిశా రాష్ట్రాల మధ్య ఉంది కొటియా గ్రామం. అక్కడి ఓటర్లకు రెండు ఓట్లు ఉంటాయి. ఒకటి ఏపీలోను, మరొకటి ఒడిశాలోను వేస్తారు. అలానే రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు అంతే. అటు ఇటు తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఆ గ్రామాలపై రగడ రేగుతోంది.

ఏపీలోని విజయనగరం జిల్లా సరిహద్దులో ఉంది వివాదాస్పద కొటియా గ్రామం. ఒక ఓటరు.. రెండు ఓట్లున్న గ్రామాలవి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలూ తమ రాష్ట్ర గ్రామాలుగానే చూస్తూ ఉంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం అసలు పట్టించుకోవు. కానీ ఇటీవల అక్కడ కొన్ని గ్రామాల్లో అనూహ్యంగా అమలవుతున్న సంక్షేమ పథకాలు.. పొలిటికల్‌ హీట్‌కు కారణంగా మారుతున్నాయి. దశాబ్దాల దుమారానికి వేదికగా నిలుస్తున్నాయి.

నేరెళ్లవలసలో గంజాయిభద్ర పంచాయతీలో 1,291 మంది ఓటర్లుండగా వారిలో 628 మంది పురుషులు, 663 మంది మహిళలున్నారు. వివాదాస్పద గ్రామాల్లో ఎన్నికలను ఇరు రాష్ట్రాలు ఎన్నికలు నిర్వహిస్తుంటారు.  అయితే ఈ 34 గ్రామాల వివాదం దశాబ్ధాలుగా కొనసాగుతున్నందున ఈ చర్చలు ఏ మాత్రం ఫలించలేదు.

కానీ రెండు సరిహద్దుల మధ్య ఉండడం కొందరికి శాపంగా మారితే.. మరికొందరికి వరంగా మారింది. ఈ సరిహద్దులో ఉన్న 34 గ్రామాల ప్రజలు.. ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటూ వస్తున్నారు. ఇటీవల ఈ సరిహద్దులో ఉన్న ఒడిశా గిరిజనులు భావిస్తున్న కొందరు.. తమ 8 గ్రామాలను ఏపీలో విలీనం చేయాలంటూ ఆందోళన చేస్తున్నారు. తమ ముత్తాతలు అందరూ తెలుగువారే అంటూ.. అందుకు సంబంధించిన తాళపత్రాలను చూపిస్తున్నారు.

1834, 1897 కాలంలో తమ వారంతా ఈ గ్రామాల్లో నివాసం ఏర్పరుచుకున్నారంటూ అందుకు సంబంధించిన కొన్ని ఎవిడెన్స్‌ను అధికారుల ముందుంచే యత్నం చేస్తున్నారు. ఏపీలో అమలవుతున్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక, పేదలకు ఇల్లు వంటి పథకాలు అమలుపై వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో తమను కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలుపుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. కోరాపూట్‌ జిల్లాలోని షెడ్యూల్‌ ప్రాంతాల్లో ఉండే ఇక్కడి వారిని కొటియా గ్రామాలుగా పిలుస్తూ ఉంటారు.

ఒక్కడ 15వేలకుపైగానే జనాభా ఉన్నారు. రెండు రాష్ట్రాల్లోనూ వీరికి ఓటరు కార్డులున్నాయి. ఒడిశా, ఏపీ రాష్ట్రాలుగా అవతరించినప్పుడు కొటియా గ్రామాల్లో సర్వే జరగలేదు. దాంతో 21 గ్రామాలను ఏ రాష్ట్రంలోనూ కలపలేదు. ఈ గ్రామాలు తమ పరిధిలోనివే అంటూ రెండు రాష్ట్రాలూ వాధిస్తూ వస్తున్నాయి. దాంతో ఈ కొటియా గ్రామాల కేసు సుప్రీంకోర్టుకు కూడా చేరింది. 2000లో సుప్రీంకోర్టు ఓ ప్రతిపాదన కూడా చేసింది. వారి సమస్య పరిష్కారానికి జిల్లా జడ్జి అధ్యక్షతన ఓ కమిటీ వేసి.. అధ్యయనం చేసినా ఫలితం లేకుండా పోయింది. 21 గ్రామాలు.. మరికొన్ని గ్రామాలుగా విడిపోగా.. ప్రస్తుతం అవి 34కు చేరుకున్నాయి.

ఈ గ్రామాల్లో రెండు పంచాయతీలు, వేర్వేరు పాఠశాలలు, అభివృద్ధి పనుల అమలు కనిపిస్తూ ఉంటాయి. బ్రిటీష్‌ ప్రభుత్వం 1942లో సర్వే చేయగా 101 గ్రామాలు సమస్యాత్మకంగా ఉన్నట్టు గుర్తించింది. అందులో 79 గ్రామాలు ఒడిశాలో విలీనం అయినప్పటికీ.. 22 గ్రామాల సంగతి మాత్రం ఎటూ తేల్చలేకపోయారు. కొటియా గ్రామాలు తమవంటే తమవని దశాబ్ధాల కిందే న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి ఏపీ, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలు. అయితే ఈ విషయాన్ని పార్లమెంటులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు రెండు రాష్ట్రాలకు సూచించింది.

ఈ కొటియా గ్రామాలు ఎవరివన్నది తేలకపోవడంతో చాలా కాలంపాటు ఒడిశా ప్రభుత్వం ఈ గ్రామాలను పెద్దగా పట్టించుకోలేదు. ఆ గ్రామాల ప్రజలకు సంక్షేమ పథకాలను చాలా కాలం పాటు అందించలేదు. గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్ట లేదు. కానీ గత పదేళ్ళుగా ఒడిశా ప్రభుత్వ ధోరణి మారిపోయింది. ఈ గ్రామాల్లో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ చర్యలను ప్రారంభించింది ఒడిశా ప్రభుత్వం. రెండు, మూడేళ్ళుగా ఈ గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల కోసం శాశ్వత భవానాల నిర్మాణాన్ని కూడా అక్కడి ప్రభుత్వం ప్రారంభించింది. అనేక చోట్ల ఏపీకి చెందిన తెలుగు బోర్డులను ఒడిశా అధికారులు, పోలీసులు తొలగించడం కూడా ప్రారంభించారు. దానికి తోడుగా 2021 ఫిబ్రవరి 10న ఏపీ ప్రభుత్వం ధోరణిపై ఒడిశా సర్కార్ మండిపడింది. తమకు చెందిన గ్రామాలలో ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ నవీన్ పట్నాయక్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లపై ఒడిశా పిటిషన్ ఫైల్ చేసింది.

ఇలాంటి సమస్యలుండగా.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయా గ్రామాలపై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో ఒడిశాదే పై చేయిగా ఉంది. ఒడిశా సర్కార్‌ .. గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయడంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఎక్కువగా ఒడిశాలోనే బోర్డులు కనిపిస్తూ ఉంటాయి. కొటియా గ్రామాల గిరిజనులు మాత్రం అటు ఒడిశా, ఇటు ఏపీ ప్రభుత్వాల పథకాలను నమ్ముకుని జీవిస్తున్నారు. 21 గ్రామాల్లోని 8 పల్లెల ప్రజలు ఏపీలో కలుస్తామని ముందుకు వస్తున్నప్పటికీ.. అది ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు.

ఈ గ్రామాల్లో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ చర్యలను ప్రారంభించింది ఒడిశా ప్రభుత్వం. రెండు, మూడేళ్ళుగా ఈ గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల కోసం శాశ్వత భవానాల నిర్మాణాన్ని కూడా అక్కడి ప్రభుత్వం ప్రారంభించింది. అనేక చోట్ల ఏపీకి చెందిన తెలుగు బోర్డులను ఒడిశా అధికారులు, పోలీసులు తొలగించడం కూడా ప్రారంభించారు. దానికి తోడుగా 2021 ఫిబ్రవరి 10న ఏపీ ప్రభుత్వం ధోరణిపై ఒడిశా సర్కార్ మండిపడింది. తమకు చెందిన గ్రామాలలో ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ నవీన్ పట్నాయక్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వం, ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లపై ఒడిశా పిటిషన్ ఫైల్ చేసింది.

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ వివాదాన్ని పార్లమెంటులో తేల్చుకోవాలనడం, పార్లమెంటులో ఈ వివాద పరిష్కారం కోసం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కారణాలుగా చూపిస్తూ.. వివాదాస్పద గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం ఎన్నికలు ఎలా నిర్వహిస్తుందంటూ ఒడిశా తమ పిటిషన్‌లో పేర్కొన్నది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసింది.

కొటియా గ్రామాలపై మొట్టమొదట 1968లో వివాదం మొదలైంది. తమకు చెందిన ఈ గ్రామాల్లో ఏపీ అక్రమంగా చొరబడుతుందంటూ సుప్రీంకోర్టును తొలిసారిగా 1968లో ఒడిశా ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. యథాతథ స్ధితి కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత సుదీర్ఘ కాలంపాటు విచారణ కొనసాగిన తర్వాత 2006లో ఒడిశా పిటిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టి వేసింది.

ఈ వివాదం పరిష్కారానికి రాష్ట్రాల ఏర్పాటు నాటి ఉత్తర్వులను, ప్రభుత్వ గెజిట్లను పరిశీలించడం, ఆధునిక సర్వే ఎక్విప్‌మెంట్లను ఉపయోగించి రాష్ట్రాల సరిహద్దులను తేల్చడం వల్ల ఈ కొటియా గ్రామాల వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించుకునే వీలుంది. కానీ ఇందులో రెండు రాష్ట్రాలు కాకుండా.. కేంద్ర ప్రభుత్వం చొరవ చూపితేనే శాశ్వత పరిష్కారానికి దారి పడుతుందని పరిశీలకులంటున్నారు. కేంద్ర చొరవ చూపేలా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు యత్నిస్తే ఫలితముండే ఛాన్స్ కనిపిస్తోంది.

ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న సమస్యలు.. ప్రస్తుతం రాజకీయానికి వేదికగా నిలిచాయి. పథకాల మాట అటు ఉంచితే.. కొత్తగా జరిపిన ఓ గుడి నిర్మాణం రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి వేదికగా మారింది. టెంపుల్‌ పేరుతో ఏపీలో కలిసేందుకు యత్నిస్తున్నారన్న ఎమ్మెల్యే రాజన్న దొర మాటలను టీడీపీ తీవ్రంగా తప్పుపడుతోంది.

ఇవి కూడా చదవండి :  Rajinikanth Returns: తలైవా మళ్లీ వస్తున్నాడు.. రీ ఏంట్రీపై తేల్చేస్తానంటున్న సూపర్ స్టార్

Kongu Nadu: ప్రత్యేక రాష్ట్రం దిశగా “కొంగునాడు”.. ప్రణాళికలు సిద్ధం చేస్తున్న కేంద్ర సర్కార్..

సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
సెంచరీలతో కదం తొక్కిన సంజూ, తిలక్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
పుష్ఫ2 సినిమా నిర్మాతలకు 7 కోట్లు మిగిల్చిన శ్రీలీల.. ఎలాగంటే?
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
డయాలసిస్‌ ఎవరికి చేస్తారో తెలుసా..? ఇది చేయకపోతే ఏం జరుగుతుందంటే
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
విద్యార్థులకు శుభవార్త.. అన్ని ప్రాథమిక పాఠశాలలు మూసివేత..!
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
గుజరాత్ దగ్గర సముద్ర జలాల్లో అనుమానాస్పద నౌక..మన నేవీ తనిఖీ చేయగా
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
తనను కలిసేందుకు వచ్చిన దివ్యాంగురాలితో వరుణ్ ముచ్చట్లు.. వీడియో
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
పిల్లల్లో పెరుగుతున్న మయోపియా వ్యాధి.. అసలిది ఎందుకు వస్తుందంటే?
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
చావాలంటే బయట.. బతకాలంటే ఇంట్లో తినండి..! బాటమ్‌ లైన్‌ ఇది..!
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
50 MP ట్రిపుల్ కెమెరా.. అదిరిపోయే ఫీచర్స్‌తో పోకో స్మార్ట్ ఫోన్
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS
'అభివృద్ధికి విద్య తప్పనిసరి.. అందుకు భారత్ కేంద్రంగా మారాలి' RSS