గేదెతో వచ్చి అధికారుల పరువు తీసిన మహిళ.. అసలు స్టోరీ ఏంటంటే..?

లంచం.. ఇది కేవలం ఒక్క చోట ఉన్న భూతం కాదు.. దేశంలో దాదాపు అన్నిచోట్ల సామాన్యుడిని పట్టిపీడిస్తుంది. ఏ ప్రభుత్వం కార్యాలయంలోనైనా.. చిన్నిచిన్న పనులు చేయించుకోవాలన్నా.. అక్కడ లంచం చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే పలు ఆఫీసుల్లో ఏలాంటి ఇబ్బంది లేకుండా పనులు అయిపోతున్నా.. మరికొన్ని చోట్ల మాత్రం లంచం ఇవ్వనిదే పని ముందుకు జరగదు. అయితే ఈ క్రమంలో కొందరు లంచం చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరికొందరు మాత్రం అవినీతి శాఖ అధికారులకు విషయం […]

గేదెతో వచ్చి అధికారుల పరువు తీసిన మహిళ.. అసలు స్టోరీ ఏంటంటే..?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 10, 2020 | 9:32 AM

లంచం.. ఇది కేవలం ఒక్క చోట ఉన్న భూతం కాదు.. దేశంలో దాదాపు అన్నిచోట్ల సామాన్యుడిని పట్టిపీడిస్తుంది. ఏ ప్రభుత్వం కార్యాలయంలోనైనా.. చిన్నిచిన్న పనులు చేయించుకోవాలన్నా.. అక్కడ లంచం చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే పలు ఆఫీసుల్లో ఏలాంటి ఇబ్బంది లేకుండా పనులు అయిపోతున్నా.. మరికొన్ని చోట్ల మాత్రం లంచం ఇవ్వనిదే పని ముందుకు జరగదు. అయితే ఈ క్రమంలో కొందరు లంచం చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరికొందరు మాత్రం అవినీతి శాఖ అధికారులకు విషయం చెప్పి.. లంచగొండి అధికారులకు చెక్ పెడుతున్నారు. అయితే మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ సంఘటన చూస్తే.. ప్రభుత్వాధికారులు తలదించుకోవాల్సిందే. లంచం అడిగి అందరిముందు పరువుపొగట్టుకున్నారు. అంతేకాదు.. వారంతా లంచగొండులన్న ముద్రపడిపోయినట్లైంది. అది కూడా అవినీతి శాఖ ప్రమేయం లేకుండానే.

వివరాల్లోకి వెళితే..నౌధియా గ్రామానికి చెందిన రాంకలీ పటేల్ అనే మహిళ స్థానిక తహశీల్దార్‌కు ఇచ్చిన లంచం.. చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆమె ఇచ్చిన గిఫ్ట్ అలాంటిది. ఆమె పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని.. తన పేరు మీద మ్యుటేషన్ చేయాలని కోరుతూ స్థానిక తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ పని పూర్తికావాలంటే.. రూ. 10వేలు లంచం ఇవ్వాలంటూ అక్కడి అధికారులు డిమాండ్ చేశారు. దీంతో సదరు మహిళ అంతమొత్తంలో డబ్బులు చెల్లించలేనని.. అధికారులను వేడుకుంది. కొద్దిమొత్తంలో డబ్బులు చెల్లించి.. తన పని పూర్తిచేయాలని కోరింది.

అయితే కొద్ది రోజుల తర్వాత మరోసారి ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లిన ఆమెకు నిరాశే ఎదురైంది. రూ.10 వేలు ఇస్తేనే పని అవుతుందని అధికారులు తెల్పడంతో.. దిక్కుతొచని పరిస్థితుల్లో ఆమె దగ్గర ఉన్న గేదెను ఎమ్మార్వో ఆఫీసుకు తీసుకొచ్చింది. లంచంగా తన గేదెను తీసుకొని తన పేరుపై మ్యుటేషన్‌ చేయాలంటూ అధికారులను కోరింది. అయితే తమపై బురదచల్లేందుకే సదరు మహిళ ఇలా గేదెను తీసుకొచ్చిందంటూ అక్కడి అధికారులు వివరణ ఇచ్చుకున్నారు. ఆమెకు సంబంధించిన పనులు నవంబర్ 14నే అయిపోయినట్లు తెలిపారు. అంతేకాదు మాపై ఇలా ఆరోపణలు చేసినందుకు.. సదరు మహిళపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామని తహసీల్దార్‌ కార్యాలయాధికారులు తెలిపారు. మొత్తానికి లంచంగా అధికారులకు గేదెను ఇవ్వబోయిన మహిళ ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రూ.3.5 లక్షలు ఉంటే ప్రపంచంలోని 50 శాతం మంది మీ కిందే..!
రూ.3.5 లక్షలు ఉంటే ప్రపంచంలోని 50 శాతం మంది మీ కిందే..!
అర్హత ఉన్నా గృహజ్యోతి అమలు అవ్వట్లేదా..? మీకే ఈ తీపి కబురు
అర్హత ఉన్నా గృహజ్యోతి అమలు అవ్వట్లేదా..? మీకే ఈ తీపి కబురు
ఈ బిగ్ బాస్ బ్యూటీని గుర్తు పట్టారా? ఆర్జీవీకి బాగా క్లోజ్
ఈ బిగ్ బాస్ బ్యూటీని గుర్తు పట్టారా? ఆర్జీవీకి బాగా క్లోజ్
ఆయన్ని అలా చూస్తే నేను తట్టుకోలేను..
ఆయన్ని అలా చూస్తే నేను తట్టుకోలేను..
ఈ డ్రైఫ్రూట్స్‌ను నానబెట్టి తినడం షుగర్ పేషెంట్స్‌కు ఓ వరం..
ఈ డ్రైఫ్రూట్స్‌ను నానబెట్టి తినడం షుగర్ పేషెంట్స్‌కు ఓ వరం..
చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశం
చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం.. అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశం
క్రెడిట్‌ కార్డుపై అప్పు ఉన్న వ్యక్తి చనిపోతే బిల్లు కట్టాలా.?
క్రెడిట్‌ కార్డుపై అప్పు ఉన్న వ్యక్తి చనిపోతే బిల్లు కట్టాలా.?
అదరగొడుతున్న మోటోరోలా ఫోన్ ఫీచర్స్..రూ.18వేలకే కర్వ్‌డ్ డిస్‌ప్లే
అదరగొడుతున్న మోటోరోలా ఫోన్ ఫీచర్స్..రూ.18వేలకే కర్వ్‌డ్ డిస్‌ప్లే
నైవేద్యం ఆలస్యమైతే కన్నయ్య సన్నబడతాడు.. ఈ ఆలయం ఎక్కడో తెలుసా
నైవేద్యం ఆలస్యమైతే కన్నయ్య సన్నబడతాడు.. ఈ ఆలయం ఎక్కడో తెలుసా
నిరుద్యోగంపై కేంద్రం సమరం..ఉద్యోగులను ప్రోత్సహించేలా కొత్త పథకాలు
నిరుద్యోగంపై కేంద్రం సమరం..ఉద్యోగులను ప్రోత్సహించేలా కొత్త పథకాలు