ఉక్రెయిన్ విమానం కూల్చింది ఇరానే..?

ఇరాన్‌లో ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్ చెందిన బోయింగ్ విమానం కూలిన ఘటనలో 176 మంది ప్రాణాలు విడిచారు. అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు రేకెత్తున్నాయి. సాంకేతిక సమస్యల వల్లే కూలిపోయిందా..? లేక ఎవరైనా కావాలనే కూల్చేశారా? అన్న కోణంలో ఉక్రెయిన్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇరాన్-అమెరికాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొన్న క్రమంలో, ఇరాన్ సంధించిన క్షిపణి ఫ్లైట్‌ను ఢీకొట్టి ఉండొచ్చని ఉక్రెయిన్ అభిప్రాయపడుతోంది. అందుకే దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమర్ […]

ఉక్రెయిన్ విమానం కూల్చింది ఇరానే..?
Follow us

|

Updated on: Jan 10, 2020 | 1:20 PM

ఇరాన్‌లో ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్ చెందిన బోయింగ్ విమానం కూలిన ఘటనలో 176 మంది ప్రాణాలు విడిచారు. అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు రేకెత్తున్నాయి. సాంకేతిక సమస్యల వల్లే కూలిపోయిందా..? లేక ఎవరైనా కావాలనే కూల్చేశారా? అన్న కోణంలో ఉక్రెయిన్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఇరాన్-అమెరికాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొన్న క్రమంలో, ఇరాన్ సంధించిన క్షిపణి ఫ్లైట్‌ను ఢీకొట్టి ఉండొచ్చని ఉక్రెయిన్ అభిప్రాయపడుతోంది.

అందుకే దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమర్ జెలెన్‌స్కీ అధికారులను ఆదేశించారు. అంతకముందు వరకు విమాన ప్రమాదానికి కారణం టెక్నికల్ ప్రాబ్లమ్స్‌ అని ఉక్రెయిన్‌ ఎంబసీ తన అధికారిక వెబ్‌సైట్లో పేర్కొంది. కానీ దేశాధ్యక్షుడు విచారణకు ఆదేశించడంతో, వెంటనే ఆ ప్రకటనను తొలగించింది. ఇక పొరపాటున ఇరాన్ క్షిపణి ఢికొనడం వల్ల విమానం కూలిపోయిందంటూ,   ఇరాన్‌‌కు చెందిన  “జోర్దానియన్ అల్ హదత్” వార్తా పత్రిక ఓ కథనం ప్రసారం చేసినట్టు ఉక్రెయిన్ న్యూస్ ఏజెన్సీలు పేర్కొన్నాయి. ఇక విమాన ప్రమాదంపై విచారణ చేసేందుకు ఉక్రెయిన్ నుంచి ఎక్స్‌పర్ట్స్ గ్రూప్ ఇరాన్ చేరుకుంది.

ఇరాన్, ఉక్రెయిన్ విమానాన్ని కూల్చివేసిందని అమెరికా బలంగా నమ్ముతోంది. అది ప్రమాదవశాత్తూ జరిగి ఉండొంచ్చంటూ అభిప్రాయపడింది. ఇక ఇదే వాదనను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సమర్ధించారు. ఇంటిలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందిందని, అందుకు ఆధారాలు కూడా ఉన్నట్లు ట్రూడో స్పష్టం చేశారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా ఈ తరహా ప్రకటనలే చేశారు. మరి ఈ విషయంపై మున్ముందు ప్రపంచ దేశాల మధ్య ఎటువంటి ముసలం ముసురుకుంటదన్నదానిపై టెన్షన్ నెలకుంది.

వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..