AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ చంద్ర గ్రహణానికి, తోడేలుకు మధ్య ఉన్న సంబంధమేంటో తెలుసా..!

ఈ సంవత్సరానికి గానూ తొలి చంద్ర గ్రహణం నేడు కనిపించనుంది. రాత్రి గం.10.37ని.లకు మొదలై గం.12.30ని.లకు పూర్తి స్థాయికి చేరి.. శనివారం తెల్లవారుజామున గం.2.42ని.లకు ఈ గ్రహణం ముగియనుంది. కాగా ఇవాళ పాక్షికంగా చంద్రగ్రహణం రానుండగా.. దాని వల్ల చందమామ పూర్తిగా కనుమరుగు అవ్వదు. అలాగే చాలా ప్రాంతాల్లో గ్రహణం కనిపించదు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం కనిపించే అవకాశాలు తక్కువేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. కోల్‌కతాలో ఇది స్పష్టంగా కనిపించనుందని తెలిపారు. ఇదిలా ఉంటే జనవరిలో […]

ఈ చంద్ర గ్రహణానికి, తోడేలుకు మధ్య ఉన్న సంబంధమేంటో తెలుసా..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 10, 2020 | 12:23 PM

Share

ఈ సంవత్సరానికి గానూ తొలి చంద్ర గ్రహణం నేడు కనిపించనుంది. రాత్రి గం.10.37ని.లకు మొదలై గం.12.30ని.లకు పూర్తి స్థాయికి చేరి.. శనివారం తెల్లవారుజామున గం.2.42ని.లకు ఈ గ్రహణం ముగియనుంది. కాగా ఇవాళ పాక్షికంగా చంద్రగ్రహణం రానుండగా.. దాని వల్ల చందమామ పూర్తిగా కనుమరుగు అవ్వదు. అలాగే చాలా ప్రాంతాల్లో గ్రహణం కనిపించదు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో చంద్రగ్రహణం కనిపించే అవకాశాలు తక్కువేనని శాస్త్రవేత్తలు అంటున్నారు. కోల్‌కతాలో ఇది స్పష్టంగా కనిపించనుందని తెలిపారు.

ఇదిలా ఉంటే జనవరిలో కనిపించే ఈ చంద్రగ్రహణానికి తోడేళ్లకు మధ్య సంబంధం ఉంది. అదేంటంటే.. ప్రస్తుతం అమెరికాలో చలి ఎక్కువగా ఉండటంతో పాటు మంచు విపరీతంగా కురుస్తూ ఉంటుంది. అందువల్ల జంతువులకు ఆహారం దొరకదు. ఇక తోడేళ్లు ఆహారం కోసం గ్రామాల శివార్లలోకి వచ్చి అరుస్తుంటాయి. అందుకే జనవరిలో కనిపించే చంద్రుణ్ని ఊల్ఫ్ మూన్(తోడేళ్లను ఇంగ్లీష్‌లో ఊల్ఫ్ అనే విషయం తెలిసిందే) అని పిలుస్తారు. ఇక ఈ గ్రహణాన్ని ‘ఉల్ఫ్ మూన్ లూనార్ ఎక్లిప్స్’ అని పిలుస్తుంటారు.

Follow Us