Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఓ రాయి పెను ప్రకంపనలు.. సీఎంకు వివరణ ఇచ్చిన ఉమాభారతి

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఓ రాయి పెను ప్రకంపనలు సృష్టించింది. కోపం కట్టలు తెంచుకుంది. ఉమా భారతికి చిర్రెత్తుకొచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన.. ఈ మాజీ ముఖ్యమంత్రి లిక్కర్‌ షాపుపై కన్నెర్రజేశారు.

Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఓ రాయి పెను ప్రకంపనలు.. సీఎంకు వివరణ ఇచ్చిన ఉమాభారతి
Uma Bharati
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 14, 2022 | 5:02 PM

Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఓ రాయి పెను ప్రకంపనలు సృష్టించింది. కోపం కట్టలు తెంచుకుంది. ఉమా భారతి(Uma Bharati)కి చిర్రెత్తుకొచ్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన.. ఈ మాజీ ముఖ్యమంత్రి లిక్కర్‌ షాపు(Liquor Shop)పై కన్నెర్రజేశారు. ఆవేశం పట్టలేని ఉమాభారతి మద్యం సీసాలను బండరాయితో పగులగొట్టేశారు. లిక్కర్‌ను నిషేధించాలని డిమాండ్‌ చేస్తున్నారు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి.తాజాగా భోపాల్‌(Bhopal)లోని ఓ మద్యం దుకాణాన్ని ధ్వంసం చేశారు. ఓ బండరాయితో లిక్కర్‌ దుకాణంలోకి నేరుగా వెళ్లిన ఆమె.. మద్యం బాటిళ్లను పగులగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉమాభారతి తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. అదే సమయంలో రాళ్లదాడిపై మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు లేఖ పంపడం ద్వారా ఆమె ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు శివరాజ్‌సింగ్‌ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. లిక్కర్‌ను మరింత తక్కువ ధరకే విక్రయించనున్నట్లు పేర్కొంది. ఉమాభారతి విధించిన డెడ్‌లైన్‌ దాటిన 2 రోజులకే ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. విదేశీ మద్యం అమ్మకాలకూ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఫారెన్‌ లిక్కర్‌పై ఎక్సైజ్ సుంకాన్ని 10-13 శాతం తగ్గించింది. ప్రజలు గతంలో కంటే నాలుగు రెట్లు ఎక్కువ మద్యం ఇంట్లో ఉంచుకోవచ్చని స్పష్టం చేసింది. వార్షిక ఆదాయం కోటి కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు ఇంట్లోనే బార్‌ను తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. అయితే, మధ్యప్రదేశ్‌లో లిక్కర్‌పై బ్యాన్‌ విధించాలని ఆమె ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. 2022 జనవరి 15 నాటికి రాష్ట్రంలో లిక్కర్‌ విక్రయాలను బ్యాన్‌ చేయాలని.. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు చేపడతామని ఆమె గత సంవత్సరమే ప్రకటించారు. మద్యం దుకాణాల ఎదుట కూర్చొని నిరసన తెలియజేస్తానని హెచ్చరించారామె.

ఇదిలావుంటే, బర్ఖేదా పఠానీలోని మద్యం దుకాణంపై రాళ్లు రువ్వడం ద్వారా తాను ఎలాంటి నిషేధ ఉద్యమాన్ని ప్రారంభించలేదని ఉమాభారతి ముఖ్యమంత్రి శివరాజ్‌ను ఉద్దేశించి తన లేఖలో రాశారు. అయితే వాస్తవం ఏమిటంటే దుకాణం అక్రమంగా నిర్వహించడమే కాకుండా ఆ దుకాణాన్ని ప్రజలు స్త్రీలను సిగ్గుపడేలా రండి. అంటూ మహిళల అగౌరవ పరిచే విధంగా ప్రకటనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో రాళ్లు రువ్వాల్సి వచ్చిందని ఉమా భారతీ పేర్కొన్నారు. మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు సమాజం చొరవ తీసుకోవాలని, ప్రభుత్వం ఆదుకోవాలని, మద్యపాన నిషేధంపై ప్రభుత్వం చొరవ చూపాలని, సమాజం ప్రభుత్వానికి అండగా నిలవాలని ఉమాభారతి తన లేఖలో రాశారు. ప్రభుత్వ అనుమతితో మద్యం దుకాణాలు తెరుస్తారు. కాబట్టి మద్యపాన నిషేధం ప్రభుత్వమే చేయాలి. డి-అడిక్షన్ ప్రచారం సమాజం నుంచి జరగాలని ఉమాభారతి సూచించారు. మాదకద్రవ్యాలు, మద్యపాన రహితం కోసం సామాజిక ప్రచారాన్ని ప్రారంభించాలని, దీనికి ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని సూచించారు.

మద్యం తాగి మహిళలు అవమానానికి గురవుతున్నారుః ఉమాభారతి కాగా, ఈ ఘటనకు సంబంధించి ఉమాభారతి వివరణ ఇచ్చారు. మార్చి 13, 2022 న, మహిళల అభ్యర్థన మేరకు, నేను భోపాల్‌లోని బర్ఖేదా పఠానీలోని ఆజాద్ నగర్‌లోని మద్యం దుకాణం, కాంపౌండ్ చూడటానికి వెళ్లాను. ఇది లేబర్ సెటిల్ మెంట్ అని మహిళల నుంచి సమాచారం అందింది. ఇక్కడ దేవాలయాలు, పాఠశాలలు ఉన్నాయి. మూడు సంవత్సరాలుగా మద్యం షాపుల మూసివేత కోసం ఆమె నిరసనలు చేస్తూనే ఉన్నారు. అధికారులు కూడా హామీ ఇచ్చారు. కానీ ఈ దుకాణాలు మూసివేయడం లేదు. ఈ విషయంపై ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పి ఆ షాపు నుంచి వెనుదిరిగిన వెంటనే కొందరు మహిళలు అకస్మాత్తుగా మద్యం షాపు వెనుక ఉన్న కుటుంబాల మహిళలు, బాలికలు మద్యం సేవించి తాగుబోతులు అవమానానికి గురిచేస్తున్నారని ఏడుస్తూ చెప్పారు. ఒక స్త్రీని మరియు ఏడుస్తున్న మహిళల గౌరవాన్ని కాపాడటానికి, ఆ దుకాణాలు వ్యతిరేక ప్రదేశాలలో ఉన్నందున మద్యం బాటిళ్లను రాయితో కొట్టానని ఉమా భారతి చెప్పారు. తాను విసిరిన రాయి రాష్ట్రంలోని మహిళలు మరియు బాలికల గౌరవం కోసం జరిగిందని ఆమ వివరణ ఇచ్చారు.

మరోవైపు రాళ్లు రువ్విన మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున కేకే మిశ్రా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాళ్ల దాడికి వ్యతిరేకంగా రాష్ట్రంలో కఠిన చట్టాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

Read Also….

Bhagwant Mann: ఎంపీ పదవికి రాజీనామా చేసిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్