Bhagwant Mann: ఎంపీ పదవికి రాజీనామా చేసిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రెండో విడత బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు సోమవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో సమావేశమై తన రాజీనామాను సమర్పించారు.

Bhagwant Mann: ఎంపీ పదవికి రాజీనామా చేసిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్
Bhagwant Mann
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 14, 2022 | 4:30 PM

Bhagwant Mann Resigns: పంజాబ్(Punjab) కాబోయే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ లోక్ సభ(Lok Sabha)  సభ్యత్వానికి రాజీనామా చేశారు. రెండో విడత బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు సోమవారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా(Om Birla)తో సమావేశమై తన రాజీనామాను సమర్పించారు. భగవంత్ మాన్ గత లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లోని సంగ్రూర్ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. పంజాబ్‌ కొత్త ముఖ్యమంత్రిగా ఈనెల16న ప్రమాణస్వీకారం చేయనున్న భగవంత్ మాన్ తన ఎంపీ పదవికి సోమవారంనాడు రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు.

ఇటీవల భగవంత్ మాన్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా ఆయనను ఎన్నికలకు ముందే ‘ఆప్’ అధినే అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించడంతో ఆయన లోక్‌సభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోక్‌సభకు తాను దూరమవుతున్నట్టు చెప్పారు. ”ఏళ్ల తరబడి తనను ఎంతగానో అభిమానించిన సంగ్రూర్ ప్రజలకు నా కృతజ్ఞతలు. ఇప్పుడు పంజాబ్ ప్రజలు నాకు చాలా పెద్ద బాధ్యత అప్పగించారు. వారందరికీ సేవ చేసుకునే భాగ్యం కలిగింది. త్వరలోనే మళ్లీ సంగ్రూర్ ప్రజల వాణి లోక్‌సభలో వినిపిస్తుంది” అని అన్నారు.

ఇదిలావుంటే పంజాబ్‌లోని ఖట్కర్‌కలన్‌ గ్రామంలో జరగనున్న భగవంత్‌ మాన్‌ ప్రమాణస్వీకారోత్సవానికి వీవీఐపీ అతిథి లేరని సమాచారం. ఢిల్లీలో మాదిరిగా పంజాబ్‌లో జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ మరే ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రిని లేదా మరే ఇతర పార్టీ పెద్ద నాయకులను ఆహ్వానించడంలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో సహా ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద నేతలు మాత్రమే ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు.

Read Also….  Digitally for Scrapping: పాత వాహనదారులకు ముఖ్య సూచన.. స్క్రాపేజ్ పాలసీ ముసాయిదాను విడుదల చేసిన కేంద్రం