Madhya Pradesh: పశువులకు ఉచితంగా టీకాలు వేయిస్తాం.. లంపీ వ్యాధి నియంత్రణపై సీఎం శివరాజ్ సింగ్ సమీక్ష

మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని లంపీ వ్యాధి వణికిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 7,686 పశువులు లంపి చర్మ వ్యాధి బారిన పడ్డాయని అధికారులు నిర్ధరించారు. వాటిలో 101 పశువులు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాయని ప్రకటించారు...

Madhya Pradesh: పశువులకు ఉచితంగా టీకాలు వేయిస్తాం.. లంపీ వ్యాధి నియంత్రణపై సీఎం శివరాజ్ సింగ్ సమీక్ష
Lampi Virus In Rajasthan
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 21, 2022 | 9:01 PM

మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని లంపీ వ్యాధి వణికిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 7,686 పశువులు లంపి చర్మ వ్యాధి బారిన పడ్డాయని అధికారులు నిర్ధరించారు. వాటిలో 101 పశువులు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యాయని ప్రకటించారు. లంపీ వ్యాధి వ్యాప్తిపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. పశువులకు టీకాలు ఉచితంగా వేస్తామని ప్రకటించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, బయటి నుంచి రాష్ట్రంలోకి పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పురుగుమందులు వ్యాప్తి చేయడం ద్వారా ఈగలు, దోమలు, ఇతర కీటకాలను చంపడం, సాధారణ పరిస్థితులు వచ్చేంత వరకు జంతువుల అమ్మడం, కొనుగోలుపై నిషేధం విధించాలని ఆయన అధికారులను కోరారు. జ్వరం, శోషరస గ్రంథులు, కాళ్లవాపు, పాల ఉత్పత్తి తగ్గడం, కళ్లు, ముక్కు నుంచి నీరు కారడం, శరీరంపై నోడ్యూల్స్ ఏర్పడటం వంటివి వ్యాధి లక్షణాలు. ప్రస్తుతం లంపీ వ్యాధి మధ్యప్రదేశ్ తో పాటు మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానాతో సహా ఎనిమిది కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఎల్‌ఎస్‌డి కారణంగా వేలాది పశువులు చనిపోయాయి. సీఎం చౌహాన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రంలో ఇప్పటివరకు 5,432 పశువులు కోలుకున్నట్లు వివరించారు.

ప్రస్తుతం రాష్ట్రంలోని 52 జిల్లాల్లో 26 జిల్లాల్లో ఈ వ్యాధి వ్యాపించిందని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. పెంపుడు జంతువుల యజమానులకు వ్యాధి, నివారణ గురించి తెలియజేయడానికి గ్రామసభ (గ్రామ స్థాయి) సమావేశాలను పిలవాలని ఆయన అధికారులను ఆదేశించారు. గో శాల్లో పశువులకు టీకాలు వేయించాలని కోరారు. టీకాలు ఉచితంగా వేస్తామని సమావేశంలో సీఎం తెలిపారు. కోవిడ్-19 మహమ్మారిపై పోరాడిన విధంగానే జంతువులను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రభావిత జంతువులను ఆరోగ్యవంతమైన వాటికి దూరంగా ప్రత్యేక ఎన్‌క్లోజర్‌లో ఉంచాలని చౌహాన్ ఆదేశించారు. రాష్ట్ర స్థాయి వ్యాధి నియంత్రణ గది టెలిఫోన్ లైన్ 0755-2767583, ఏదైనా అత్యవసర పరిస్థితిని పరిష్కరించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1962 ఏర్పాటు చేసినట్లు అధికారు తెలిపారు.

మరోవైపు.. రాజస్థాన్ లోనూ లంపీ వ్యాధి వేగంగా విస్తృతి చెందుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 7.73 లక్షల జంతువులు కోలుకున్నాయి. లంపీ వ్యాధి నివారణ కోసం రాజస్థాన్ కోఆపరేటివ్ డెయిరీ ఫెడరేషన్, పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా గోవులకు లంపి నివారణకు టీకాలు వేస్తున్నాయని కటారియా తెలిపారు. మరణించిన జంతువుల దహన విషయంలో శాస్త్రీయ పద్ధతిని పాటిస్తున్నామని.. గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితులు, స్థానిక సంస్థల నుంచి పూర్తి సహకారం అందుతోందని అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..