Video Viral: భూమిపై నువ్వు.. నీటిలో నేను.. నీళ్లు తాగేందుకు వచ్చిన చిరుతపై మొసలి దాడి.. వీడియో చూస్తే వామ్మో అనాల్సిందే..

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, వేగవంతమైన జీవుల జాబితాలో చిరుతుపులులు ముందు వరసలో ఉంటాయి. వాటి వేగాన్ని అడవిలోని ఓ జంతువూ అందుకోలేదు. అయితే నీటిలో మాత్రం మొసలిని మించిన..

Video Viral: భూమిపై నువ్వు.. నీటిలో నేను.. నీళ్లు తాగేందుకు వచ్చిన చిరుతపై మొసలి దాడి.. వీడియో చూస్తే వామ్మో అనాల్సిందే..
Crocodile Attack Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 21, 2022 | 3:54 PM

ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన, వేగవంతమైన జీవుల జాబితాలో చిరుతుపులులు ముందు వరసలో ఉంటాయి. వాటి వేగాన్ని అడవిలోని ఓ జంతువూ అందుకోలేదు. అయితే నీటిలో మాత్రం మొసలిని మించిన మరో ప్రాణి లేదనే చెప్పాలి. ఎందుకంటే భూమిపై నిదానంగా నడిచే మొసలి నీటిలో తన సత్తా ఏంటో చూపిస్తుంది. సాధారణంగా అడవిలో రకరకాల జంతువులు నివాసముంటాయి. క్రూర జంతువులు, మాంసాహార, శాకాహార జంతువులు ఉంటాయి. అయితే అడవిలో జీవించడం అనేది అంత సులభమైన విషయం కాదు. నిరంతరం సవాళ్లతో కూడుకున్నది. ప్రమాదం ఏ వైపు నుంచైనా ముంచుకురావచ్చు. ఈ ఘటనల్లో ప్రాణాలూ కోల్పోవచ్చు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. వీటిని చూసేందుకూ జనాలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. వీటిలో చాలా వీడియోలు గూస్‌బంప్స్‌ తెప్పిస్తాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

ఈ క్లిప్ లో ఒక మొసలి చెరువులో నీరు తాగుతున్న చిరుతను రెప్పపాటు కాలంలో వేటాడుతుంది. నీరు తాగేందుకు చెరువు వద్దకు వచ్చిన చిరుతను అక్కడే ఉండి కాపు కాస్తున్న మొసలి ఒక్క ఉదుటున ఎగిరి దాడి చేస్తుంది. ఏం జరిగిందో తెలుసుకునేలోపే చిరుతను నీటిలో లాక్కెళ్లిపోతుంది. తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా నీటి లోతుల్లోకి తీసుకెళ్లిపోయింది. అక్కడే ఉన్న మరో చిరుత ఈ దృశ్యాలను చూస్తూ నివ్వెరపోయింది. తన స్నేహితుడు ఏమయ్యాడోనని బిత్తర చూపులు చూస్తూ ఉండిపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ క్లిప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. 45 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 68 వేలకు పైగా వీక్షించగా, వందలాది మంది లైక్ చేశారు. వీడియో చూసిన తర్వాత ప్రజలు వివిధ రకాల రియాక్షన్లు ఇస్తున్నారు. ‘ప్రకృతి నిజంగా క్రూరమైనది’ అని మరికొందరు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే