AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jharkhand MLA: జాతీయ రహదారిపై గుంతలు.. రోడ్డుపై బురదనీటిలో స్నానం చేసి నిరసన తెలిపిన మహిళా ఎమ్మెల్యే..

Jharkhand MLA: వర్షాలు పడితే చాలు అక్కడి రోడ్లన్నీ చిత్తడి అవుతున్నాయి. అక్కడ మాత్రమే కాదు.. దేశమంతా ఇదే పరిస్థితి కన్పిస్తోంది. పాడైపోయిన రోడ్లను బాగుచేసే నాథుడే లేకుండాపోయాడు.

Jharkhand MLA: జాతీయ రహదారిపై గుంతలు.. రోడ్డుపై బురదనీటిలో స్నానం చేసి నిరసన తెలిపిన మహిళా ఎమ్మెల్యే..
Mla
Shiva Prajapati
|

Updated on: Sep 21, 2022 | 3:38 PM

Share

Jharkhand MLA: వర్షాలు పడితే చాలు అక్కడి రోడ్లన్నీ చిత్తడి అవుతున్నాయి. అక్కడ మాత్రమే కాదు.. దేశమంతా ఇదే పరిస్థితి కన్పిస్తోంది. పాడైపోయిన రోడ్లను బాగుచేసే నాథుడే లేకుండాపోయాడు. రాష్ట్ర రహదారులు ఒలెక్కయితే.. జాతీయ రహదారులు మరోలెక్క. తాజాగా రోడ్ల దుస్థితిపై జార్ఖండ్‌లో మహిళా ఎమ్మెల్యే వినూత్నరీతిలో నిరసన తెలిపారు. జాతీయ రహదారికి మరమ్మతులు చేయాలని డిమాండ్ చేస్తూ గొడ్డా మహిళా ఎమ్మెల్యే దీపికాపాండే సింగ్ బురదనీటిలో దిగి స్నానం చేశారు.

వివరాల్లోకెళితే.. జార్ఖండ్‌లోని 133వ నెంబర్ జాతీయ రహదారిపై భారీగా గుంతలు పడ్డాయి. ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని పలు సార్లు జాతీయ రహదారుల విభాగం అధికారులకు ఆమె విన్నవించారు. అయినా వారు పట్టించుకోవడం లేదు. నేషనల్ హైవే అధ్వానంగా మారడంతోపాటు వర్షం కురిస్తే చాలు బురదనీరు రోడ్డుపైనే నిలుస్తోంది. రోడ్డుకు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల ప్రతీరోజూ ఈ రహదారిపై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా కేంద్ర నేషనల్ హైవే విభాగం అధికారులు పట్టించుకోక పోవడంతో బుధవారం ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గుంతల రోడ్డుపైకి వచ్చి, ఆ రోడ్లపై ఉన్న గుంతల్లోని బురదనీటిలో దిగి స్నానం చేసి నిరసన తెలిపారు. జాతీయ రహదారికి మరమ్మతు పనులు చేపట్టేవరకూ తాను బురదనీటిలో నుంచి బయటకు రానని ఎమ్మెల్యే దీపికా బీష్మించుకు కూర్చున్నారు. బురదనీటిలో మహిళా ఎమ్మెల్యే వినూత్న నిరసనతో ప్రజలు, అధికారులు తరలివచ్చారు. వీలైనంత త్వరగా రోడ్డు మరమ్మతు పనులు చేపడతామని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..