AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: ట్రాఫిక్ కారణంగానే ప్రేమలో పడ్డా.. కానీ ఆ కష్టాలు మాత్రం తీరలేదు.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ట్వీట్..

ప్రేమ ఎంత విచిత్రమైనదంటే క్షణ కాలంలో కలిగే ఫీలింగ్ ను జీవితాంతం గుర్తుంచుకునేలా చేస్తుంది. ఒక మనిషిపై ఇష్టం కలగాలంటే నెలలకు నెలలు ఆగాల్సిన అవసరం లేదు. సెకనులో వెయ్యో వంతు..

Video Viral: ట్రాఫిక్ కారణంగానే ప్రేమలో పడ్డా.. కానీ ఆ కష్టాలు మాత్రం తీరలేదు.. నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ట్వీట్..
Traffic
Ganesh Mudavath
|

Updated on: Sep 21, 2022 | 4:51 PM

Share

ప్రేమ ఎంత విచిత్రమైనదంటే క్షణ కాలంలో కలిగే ఫీలింగ్ ను జీవితాంతం గుర్తుంచుకునేలా చేస్తుంది. ఒక మనిషిపై ఇష్టం కలగాలంటే నెలలకు నెలలు ఆగాల్సిన అవసరం లేదు. సెకనులో వెయ్యో వంతు సమయంలోనూ ప్రేమ చిగురిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే విపరీతమైన ట్రాఫిక్ లో చిక్కుకున్న ఓ యువకుడు అక్కడే ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత మాటలు కలిపి, డేటింగ్ చేసి, చివరకి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఐటీ నగరి బెంగళూరులో ట్రాఫిక్‌ కష్టాలు ఎలా ఉంటాయో మాటల్లో చెప్పలేం. ఒక పక్క ట్రాఫ్రిక్‌ తోపాటు, గుంతల రోడ్లపై ప్రయాణించాలంటేనే వాహనదారులు పట్టపగలే చుక్కలు చూస్తుంటారు. సమయానికి ఆఫీస్ లకు చేరుకోలేక బాస్ లతో చీవాట్లు పడుతుంటారు. ఐతే ఇక్కడొక వ్యక్తి ఆ టాఫ్రిక్‌ సమస్య కారణంగా తాను ప్రేమలో పడ్డానని, పెళ్లి కూడా చేసుకున్నానని చెబుతున్నాడు. ఇందుకు సంబంధించన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి.. ఎజిపురా ఫ్లై ఓవర్‌ నిర్మాణం కారణంగా ట్రాఫిక్‌లో చిక్కు‍కున్నాడు. అప్పుడే వరల్డ్ సిగ్నల్ వద్ద అతనికి ఓ యువతి కనిపించింది. చూడగానే ఆమెపై మనసు పారేసుకున్నాడు. ఆ రోజు విపరితమైన ట్రాఫిక్‌ ఉందని, దీంతో షార్ట్‌కట్‌లో వల్తున్న సమయంలో ఆమె కనిపించినట్లు చెప్పాడు. ఆమెను చూసిన తర్వాత ధైర్యం తెచ్చుకుని మాట్లాడానని, ఆకలి వేయడంతో దగ్గరలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లినట్లు చెప్పాడు. అప్పుడే తమ మధ్య ప్రేమ చిగురించిందని వివరించారు. ఆ తర్వాత మూడేళ్లు డేటింగ్‌లో ఉన్నామని, అభిప్రాయాలు కలవడంతో పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తమ పెళ్లై రెండేళ్లవుతుందని చెబుతున్నాడు. తాము ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం కూడా అయిపోయి దాదాపు ఐదేళ్లు అయినా, ఆ ఫ్లైఓవర్‌ మాత్రం నిర్మాణంలోనే ఉందని సెటైర్లు వేశాడు. ట్రాఫ్రిక్‌ సమస్య మాత్రం తీరలేదని నవ్వుతూ చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఈ లవ్‌ స్టోరీ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. అతని ప్రేమ కథను విన్న నెటిజన్లు ట్రాఫిక్‌ కొందరికి చేదు అనుభవాలు ఇస్తే, ఇతనికి మాత్ర మాత్రం మంచి అనుభవాన్ని ఇచ్చిందంటూ ప్రశంసిస్తున్నారు. తమ జీవితంలోనూ ఇలాగే జరగాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి