Viral: ప్రియురాలితో హోటల్ గదిలో భర్త.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. ఆ తర్వాత
పద్దతి మార్చుకోవాలని భార్య.. భర్తను ఎన్నోసార్లు కోరింది. కానీ అతడు మాట వినడం లేదు. దీంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని బుద్ధి చెప్పాలని భావించింది.
Trending: వివాహేతర సంబంధాలకు సంబంధించిన వార్తలు మనం తరుచుగా చదువుతూనే, వింటూనే ఉంటాం. మరొకరితో రాసలీలల్లో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా.. భాగస్వాములను పట్టుకున్న వీడియోలు మాత్రం అరుదుగా బయటకు వస్తాయి. తాజాగా అలాంటి ఘటనే ఆగ్రా(Agra)లో వెలుగుచూసింది. హోటల్ గదిలో ప్రియురాలితో ఉన్న తన భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది భార్య. ఆపై ఆమె కోసం నషాలానికి అంటింది. వారిద్దరినీ చెప్పులతో తీవ్రంగా కొట్టింది. భర్త చేతులు జోడించి వేడుకున్నా కూడా ఆమె కనికరించలేదు. అపరకాళిగా మారి పిచ్చిపిచ్చిగా బాదేసింది. భర్త ప్రవర్తనతో విసిగిపోయినట్లు భార్య చెప్పింది. అతను దారిని సరిదిద్దుకోవడానికి అతనికి చాలా అవకాశాలు ఇచ్చినప్పటికీ, వినియోగించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ జంటకు పెళ్లి అయ్యి 16 సంవత్సరాలు అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్త ట్రాక్ తప్పాడు. పరాయి స్ట్రీల వ్యామోహంలో పడి.. కుటుంబాన్ని అశ్రద్ద చేశాడు. దీంతో అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని బద్ధి చెప్పాలని భావించింది. తన భర్తపై ఓ కన్నేసి ఉంచాలని బంధువులను కోరింది. తాజాగా రాజమండి రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న ఓ హోటల్‌లో తన భర్త ఓ మహిళతో ఉన్నట్లు ఆమెకు పక్కా సమాచారం అందింది. దీంతో వెంటనే అక్కడికి వెళ్లి.. ఇరువురిని కసితీరా కొట్టింది. వివాదంపై తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. అయితే ఈ వ్యవహారంపై ఎవరి నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
होटल के कमरे में दूसरी महिला संग पकड़ा गया पति, देखते ही पत्नी ने चप्पल से पीटा#UttarPradeshNews #agra #Videos #ViralVideo #reelsvideo #trendingvideos pic.twitter.com/eKdrxRSvEH
— News Track (@newstracklive) September 20, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..