AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World’s Largest Rudra Veena: ప్రపంచంలోనే అతి పెద్ద రుద్ర వీణ.. ఎలా తయారు చేశారో తెలుసా..? తెలిస్తే అభినందించకుండా ఉండలేరు..

రిసైక్లింగ్( పునర్వినియోగం) వల్ల అనేక వ్యర్థాలను తిరిగి వాడుకునేలా చేయవచ్చు. ముఖ్యంగా ఇనుము, అల్యూమినియం వంటి లోహాల స్క్రాప్‌తో ఆకర్షణీయమైన బొమ్మలను చేయవచ్చు. ఇలా చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ బస్‌స్టాండ్ ఎదుట కూడా..

World's Largest Rudra Veena: ప్రపంచంలోనే అతి పెద్ద రుద్ర వీణ.. ఎలా తయారు చేశారో తెలుసా..? తెలిస్తే అభినందించకుండా ఉండలేరు..
Worlds Largest Rudra Veena
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 17, 2022 | 3:39 PM

Share

రిసైక్లింగ్( పునర్వినియోగం) వల్ల అనేక వ్యర్థాలను తిరిగి వాడుకునేలా చేయవచ్చు. ముఖ్యంగా ఇనుము, అల్యూమినియం వంటి లోహాల స్క్రాప్‌తో ఆకర్షణీయమైన బొమ్మలను చేయవచ్చు. ఇలా చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ బస్‌స్టాండ్ ఎదుట కూడా మీరు స్క్రాప్‌తో చేసిన ఏనుగు, జిరాఫీ, గుర్రం, హెలీకాఫ్టర్ వంటి బొమ్మలను చూడవచ్చు. అవి మన చూపులను అలా కట్టివేస్తాయి. అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్‌కు చెందిన కళాకారుల బృందం కూడా అలాంటి పనే చేసింది. అయితే వీరు కళాకారులు కదా.. అందుకే వారిదైన రీతిలో వినూత్నంగా ప్రయత్నించి సఫలమయ్యారు. వ్యర్థంగా పడి ఉన్న వాహనాల స్క్రాప్‌ను ఉపయోగించి ఆరు నెలల్లో ప్రపంచంలోనే అతిపెద్ద రుద్ర వీణను నిర్మించారు ఆ కళాకారులు. కొత్త తరంలో భారతీయ సంస్కృతిపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ భారీ వీణను తయారు చేసినట్లు వారు చెబుతున్నారు.

28 అడుగుల పొడవుతో ఉన్న ఈ భారీ వీణ 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దాదాపు రూ.10 లక్షలతో ఆరు నెలల్లో తయారు చేసిన ఈ భారీ  వీణ కోసం చైన్‌లు, గేర్లు, బాల్ బేరింగ్‌లు, వైర్లు వంటి వాహనాల విడిభాగాలను ఉపయోగించారు. దీని ప్రత్యేకత ఏమంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రుద్ర వీణ కావడమే. చైన్, గేర్, బాల్ బేరింగ్, వైర్ వంటి వాహనాల స్క్రాప్‌ల నుంచి ఈ రుద్ర వీణను తయారు చేశామని కళాకారుల బృంధంలో ఒకరైన పవన్ దేశ్‌పాండే తెలిపారు. ఇంకా ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రుద్ర వీణ అని,  దీనికోసం 15 మంది ఆర్టిస్టులు పనిచేశారని ఆ కళాకారుల బృందం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

భారతీయ సంస్కృతి గురించి మన యువ తరానికి మరింత తెలియజేసేందుకు ఈ వీణ తయారీకి పూనకున్నట్లు బృందం సభ్యులు పేర్కొన్నారు. ‘‘ఈ భారీ రుద్ర వీణను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం దానిని ప్రదర్శణలో పెడతాం. వారు దీనితో సెల్ఫీలు తీసుకోవచ్చు.  ఇంకా ఈ రుద్రవీణలో మ్యూజికల్ సిస్టమ్, లైట్లు ఏర్పాటు చేస్తాం. ఇది మన తర్వాతి తరానికి ఆదర్శం కావాలి. ఇలాంటి పనులపై యువతలో మరింత ఆసక్తి కలిగించడమే మా ఉద్దేశమ’’ని దేశ్‌పాండే అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..