Pocket Money: రూ.2 వేలు ఇవ్వలేదనీ.. తండ్రిని చంపిన తనయుడు

పాకెట్ మనీ ఇవ్వలేదని తండ్రిని దారుణంగా చంపాడో కొడుకు. మధ్యప్రదేశ్‌లో ఇండోర్ జిల్లాలో సోమవారం (జూన్‌ 19) ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. బాబు చౌదరి (50) అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని..

Pocket Money: రూ.2 వేలు ఇవ్వలేదనీ.. తండ్రిని చంపిన తనయుడు
Son Kills Father
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 21, 2023 | 9:28 AM

భోపాల్: పాకెట్ మనీ ఇవ్వలేదని తండ్రిని దారుణంగా చంపాడో కొడుకు. మధ్యప్రదేశ్‌లో ఇండోర్ జిల్లాలో సోమవారం (జూన్‌ 19) ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. బాబు చౌదరి (50) అనే వ్యక్తి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. దేపాల్‌పూర్ ప్రాంతంలోని పొలంలో జూన్‌ 15న బాబు చౌదరి విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నేరం జరిగిన ప్రదేశం నుంచి సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా మృతుడి కొడుకే హంతకుడని తేలింది. పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) హితికా వాసల్ తెలిపిన వివరాల ప్రకారం..

బాబు చౌదరి కొడుకు సోహాన్‌ (25) గత కొంతకాలంగా డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో జూన్‌ 15 రాత్రి ఖర్చులకు రూ.2000 ఇవ్వాలని సోహాన్‌ తండ్రిని కోరాడు. అందుకు తండ్రి నిరాకరించాడు. దీంతో కోపోధ్రిక్తుడైన సోహాన్‌ రాయితో తండ్రిపై దాడి చేశాడు. బాబు చౌదరి తలపై రాయితో పదేపదే మోదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై నిందిడుతు సోహాన్‌ను అరెస్ట్‌ చేశామని, విచారణ కొనసాగుతున్నట్లు ఎస్పీ హితికా వాసల్ మీడియాకు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.