Lohit Express: తప్పిన పెను ప్రమాదం.. రెండు భాగాలుగా విడిపోయిన ఎక్స్‌ప్రెస్‌ రైలు.. రైళ్లో నుంచి బయటికి దూకిన ప్రయాణికులు

ఒరిస్సా రైలు ప్రమాదం ఘటన మరువకముందే మరో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. లోహిత్​ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన 10 బోగీలు ఇంజన్‌ నుంచి విడిపోయాయి.​అస్సాంలోని గౌహతి నుంచి జమ్మూ తపాయికి వెళ్తుండగా ఈ ఘటన..

Lohit Express: తప్పిన పెను ప్రమాదం.. రెండు భాగాలుగా విడిపోయిన ఎక్స్‌ప్రెస్‌ రైలు.. రైళ్లో నుంచి బయటికి దూకిన ప్రయాణికులు
Lohit Express
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 21, 2023 | 8:08 AM

న్యూఢిల్లీ: ఒరిస్సా రైలు ప్రమాదం ఘటన మరువకముందే మరో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. లోహిత్​ఎక్స్‌ప్రెస్ రైలుకు చెందిన 10 బోగీలు ఇంజన్‌ నుంచి విడిపోయాయి.​అస్సాంలోని గౌహతి నుంచి జమ్మూ తపాయికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంజిన్ నుంచి సుమారు 10 బోగీలు విడిపోయి పట్టాలపై నిలిచిపోయాయి. దీంతో లోహిత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు భాగాలుగా విడిపోయింది. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు తీవ్ర భమాందోళనకు గురయ్యారు. కొందరు భయంతో రైలు నుంచి కిందికి దూకేశారు. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని దల్‌ఖోలా – బీహార్‌లోని కిషన్‌గంజ్ మధ్య ఉన్న సూర్యకమల్ రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.

ఇంజన్‌ ముందుకు కదిలివెళ్లిపోవడంతో.. పది కోచ్‌లు పట్టాలపైనే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటన ఘటనాస్థలికి చేరుకుని ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. అనంతరం విడిపోయిన బోగీలను మళ్లీ ఇంజిన్‌కు జతచేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఐతే రైలు 16 గంటలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. కప్లింగ్ వైఫల్యం కారణంగా రైలు కోచ్‌లు విడిపోయినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

కాగా ఒడిశాలోని బాలేశ్వర్‌ రైలు ప్రమాదంలో మూడు రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 291 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంతటి ఘోర ప్రమాదం తర్వాత కూడా రైల్వే అధికారుల్లో చిత్తశుద్ధి లేదని, ప్రయాణికుల భద్రతను అధికారులు పట్టించుకోవట్లేదనే ఆరోపణలు వినిపిస్తు్న్నాయి. మరో ఘటనలో ఆదివారం తెల్లవారుజామున మరో రైలు ప్రమాదం తప్పింది. లక్నోలోని నిగోహన్ రైల్వే స్టేషన్‌లో నీలాచల్ ఎక్స్‌ప్రెస్ మెయిన్ లైన్‌కు బదులుగా లూప్ లైన్ నుంచి వెళుతుండగా రైలు ఒక్కసారిగా కుదుపులకు గురైంది. తనిఖీ చేయగా, వేడి కారణంగా రైల్వే పట్టాలు కరిగిపోయి విస్తరించినట్లు అధికారులు గుర్తించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.