Cancelled Trains Today: ప్రయాణికులకు గమనిక.. నేడు, రేపు హైదరాబాద్‌- విశాఖ మధ్య పలు రైళ్ల రద్దు

భద్రతాపరమైన పనులు జరుగుతున్న కారణంగా ఖరగ్‌పుర్‌ డివిజన్‌లో రెండు రోజుల పాటు (బుధవారం, గురువారం) పలు రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. ఈ మేరకు తెలియజేస్తూ వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎకె త్రిపాఠి మంగళవారం (జూన్ 20) ప్రకటన..

Cancelled Trains Today: ప్రయాణికులకు గమనిక.. నేడు, రేపు హైదరాబాద్‌- విశాఖ మధ్య పలు రైళ్ల రద్దు
Cancelled Trains
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 21, 2023 | 7:26 AM

విశాఖపట్నం: భద్రతాపరమైన పనులు జరుగుతున్న కారణంగా ఖరగ్‌పుర్‌ డివిజన్‌లో రెండు రోజుల పాటు (బుధవారం, గురువారం) పలు రైళ్ల సర్వీసులు రద్దయ్యాయి. ఈ మేరకు తెలియజేస్తూ వాల్తేరు సీనియర్‌ డీసీఎం ఎకె త్రిపాఠి మంగళవారం (జూన్ 20) ప్రకటన వెలువరించారు. ఈ నేపథ్యంలో సుమారు 11 రైళ్ల సర్వీసులు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. కాగా గత కొంత కాలంగా పలు రైళ్వే డివిజన్లలో జరుగుతున్న పనుల నిమిత్తం ఆయా రోజుల్లో రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా ప్రకటనతో ఏయే రోజున ఏయే రైళ్లు రద్దుకానున్నాయో ఆ వివరాలు మీకోసం..

బుధవారం (జూన్ 21) నాడు రద్దైన రైళ్ల వివరాలు..

  • పుదుచ్చేరి-హావ్‌డా (12868)
  • షాలిమార్‌-హైదరాబాద్‌ (18045)
  • హైదరాబాద్‌-షాలిమార్‌ ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (18046)
  • విశాఖ-షాలిమార్‌ (22854)
  • షాలిమార్‌-సికింద్రాబాద్‌ (12773)
  • ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-షాలిమార్‌ (22826)
  • హావ్‌డా-సత్యసాయి ప్రశాంతి నిలయం (22831)
  • తాంబరం-సంత్రాగచ్చి (22842)
  • షాలిమార్‌-సికింద్రాబాద్‌ (22849)

గురువారం (జూన్ 22) నాడు రద్దైన రైళ్ల వివరాలు..

  • ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-సంత్రాగచ్చి (22808)
  • ఎస్‌ఎంవీ బెంగళూరు-హావ్‌డా (22888)

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.