Hyderabad: హైదరాబాదీలకు హై అలర్ట్.. కాసేపట్లో ఈదురుగాలుతో వర్షం కురిసే అవకాశం.
హైదరాబాద్ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. మరికాసేపట్లో నగరంలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సాయంత్రం 7 గంటల తర్వాత పలు ప్రాంతాల్లో వర్షం పడనున్నట్లు తెలిపింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది...
హైదరాబాద్ ప్రజలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. మరికాసేపట్లో నగరంలో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. సాయంత్రం 7 గంటల తర్వాత పలు ప్రాంతాల్లో వర్షం పడనున్నట్లు తెలిపింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కురుస్తుందని తెలింది. ఉపరితల వాయువ్య దిశ నుంచి గంటకు 8-10 కి.మీల వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఇదిలా ఉంటే హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలోనూ మంగళవారం నుంచి బుధవారం వరకు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కుఇసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని, ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హనుమకొండ, వరంగల్, జనగాం జిల్లాలలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..