Odisha Train Accident: పట్టాలపై దొరికిన ప్రేమ లేఖలు.. గుండెను పిండేసేలా కవితలు, పద్యాలు
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఎంతోమంది బాధితుల కలలను నాశనం చేసింది. రైలు ప్రమాదం జరిగనప్పటి నుంచి ఒక్కొక్కరి హృదయ గాథలు వెలుగుచూస్తున్నాయి. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఓ బెంగాలీ ప్రయాణికుడు తన డైరీలో రాసుకున్న ప్రేమ కాగితాలు రైలు పట్టాలపై చెల్లచెదురుగా పడిపోయాయి.
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఎంతోమంది బాధితుల కలలను నాశనం చేసింది. రైలు ప్రమాదం జరిగనప్పటి నుంచి ఒక్కొక్కరి హృదయ గాథలు వెలుగుచూస్తున్నాయి. కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ఓ బెంగాలీ ప్రయాణికుడు తన డైరీలో రాసుకున్న ప్రేమ కాగితాలు రైలు పట్టాలపై చెల్లచెదురుగా పడిపోయాయి. చిన్ని చిన్ని మేఘాలు చిరుదజల్లులు కురిపించగా.. మనం వినే చిన్ని చిన్ని కథల్లోంచే ప్రేమ కుసుమాలు విరబూస్తాయి అని బెంగాలీ భాషలో రాసి ఉంది.
మరో కాగితంలో అన్ని వేళలా నీ పేమ కావాలి.. ఎప్పటికీ నువ్వు నా మదిలోనే ఉంటావు అని రాసి ఉంది. ఇలాంటి కవితలు, పద్యాలే కాకుండా రంగురంగులతో గీసిన చిత్రాలు కూడా కనిపించాయి. అయితే ఈ డైరీ ఎవరిది.. ఆ వ్యక్తి బతికే ఉన్నాడా లేదా అనే విషయం ఇంకా తెలియలేదు. రైలు ప్రమాదం జరిగిన అనంతరం సహాయక చర్యలు చేపట్టిన సిబ్బందికి ఈ లవ్ లెటర్స్ కనిపించాయి. వీటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసిన నెటీజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. ఇదిలా ఉండగా ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్, పాయింట్ మెషిన్‌లో మార్పుల వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పిన విషయం తెలిసిందే.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..