AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lok Sabha Election Results: గెలుపోటములపై నోటా ప్రభావం.. జాతకాన్ని మార్చిన నోటా మీట..!

ఏడు విడతల్లో హోరాహోరీగా సాగిన లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీయే కాదు.. అత్యల్ప మెజారిటీ కూడా నమోదైంది. కొందరు గత రికార్డులను చెరిపేస్తూ అత్యధిక మెజార్టీతో అఖండ విజయం సాధించగా, కొందరు ఉత్కంఠ పోరులో త్రుటిలో గట్టెక్కగలిగారు.

Lok Sabha Election Results: గెలుపోటములపై నోటా ప్రభావం.. జాతకాన్ని మార్చిన నోటా మీట..!
Nota Power
Balaraju Goud
|

Updated on: Jun 05, 2024 | 7:55 PM

Share

ఏడు విడతల్లో హోరాహోరీగా సాగిన లోక్‌సభ ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీయే కాదు.. అత్యల్ప మెజారిటీ కూడా నమోదైంది. కొందరు గత రికార్డులను చెరిపేస్తూ అత్యధిక మెజార్టీతో అఖండ విజయం సాధించగా, కొందరు ఉత్కంఠ పోరులో త్రుటిలో గట్టెక్కగలిగారు. అయితే నన్ ఆఫ్ ది ఎబౌవ్ అంటూ ఓటర్లు నొక్కిన మీటతో ప్రధాన పార్టీల అభ్యర్థుల జాతకాలు మారిపోయాయి.

అభ్యర్థులెవరూ నచ్చకపోతే ఓటర్లు ప్రయోగించే ఆయుధం. తలరాతలు తలకిందులు చేసే పాశుపతాస్త్రం. అదే.. నోటా. నోటా మీట.. నొక్కితే బాక్సు బద్దలవ్వాల్సిందే.. అభ్యర్థుల గుండెలు పగిలిపోవాల్సిందే. ఈవీఎం బాక్సుపై సైలెంటుగా చివరి స్థానంలో ఉండే నోటా… ఎంత వయొలెన్స్‌ని క్రియేట్‌ చేస్తోందో ఈ సార్వత్రిక ఎన్నికలు నిరూపించాయి. నోటా ఓట్లు పెరిగే కొద్దీ.. కొంత మంది అభ్యర్థుల అడ్రస్‌ గల్లంతైంది.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థుల తలరాతలను నోటా మార్చేసింది. నన్ ఆఫ్ ది ఎబౌవ్ అంటూ ఓటర్లు నొక్కిన మీటతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. పలు స్థానాల్లో గెలిచిన అభ్యర్థుల ఆధిక్యం కంటే.. నోటాకు వచ్చిన ఓట్లే ఎక్కువ. చివరి రౌండ్ వరకూ ఉత్కంఠ నెలకొన్న పలు సీట్లలో కొద్దిలో ఓటమి పాలైన అభ్యర్థులు నోటాకు పడ్డ ఓట్లను తలుచుకుని బాధపడుతున్నారు. నోటాకు పడ్డ ఓట్లు కాస్త అటూఇటుగా తమకు పడి ఉంటే విజయం తమనే వరించేదని వాపోతున్నారు.

మహారాష్ట్రలోని ముంబై వాయవ్య నియోజకవర్గంలో అనూహ్య ఫలితం వెలువడింది. ఈ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు సందర్భంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇద్దరి మధ్య విజయం దోబూచులాడింది. చివరికి ఏక్‌నాథ్‌ షిందే నేతృత్వంలోని శివసేన పార్టీ అభ్యర్థి రవీంద్ర దత్తారామ్‌ వైకర్‌ కేవలం 48 ఓట్ల అతితక్కువ మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి అమోల్‌ కీర్తికర్‌పై గెలుపొందారు. వాయ్‌కర్‌కు 4,52,644 ఓట్లు లభించగా అమోల్‌కు 4,52,596 ఓట్లు లభించాయి.

కేరళలోని అత్తింగళ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్వొకేట్‌ అదూర్‌ ప్రకాశ్, సీపీఎం అభ్యర్థి వి.జాయ్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. చివరకు 684 ఓట్ల మెజారిటీతో అదూర్ ప్రకాశ్ విజయం సాధించారు. అదేసమయంలో ఇక్కడ నోటాకు ఏకంగా 9,791 మంది ఓటేశారు. ఒడిశాలోని జయపురంలో బీజేపీ అభ్యర్థి రవీంద్ర నారాయణ్‌ బెహరా తన సమీప ప్రత్యర్థి బీజేడీ అభ్యర్థి శర్మిష్ఠ సేథీపై 1,587 ఓట్లతో గెలుపొందారు. బెహరాకు 5,34,239 ఓట్లు, సేథికి 5,32,652 ఓట్లు వస్తే… నోటాకు 6,788 ఓట్లు పడ్డాయి.

రాజస్థాన్‌లోని జైపూర్‌ రూరల్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్ ఛోప్రా కేవలం 1,615 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర సింగ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఛోప్రాకు 6,16,262 ఓట్లు, సింగ్‌కు 6,17,877 ఓట్లు రాగా నోటాకు 7,519 ఓట్లు పోలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్‌ నియోజకవర్గంలోనూ నోటాకే మెజార్టీ. కాంగ్రెస్ అభ్యర్థి బీరేశ్ ఠాకూర్ పై బీజేపీ అభ్యర్థి భోజ్‌రాజ్‌ నాగ్‌ 1,884 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాజ్ నాగ్ కు 5,97,624 ఓట్లు, ఠాకూర్‌కు 5,95,740 ఓట్లు పోలవగా.. నోటాకు ఏకంగా 18,669 మంది ఓటేశారు. ఇలా ఈ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ చెల్లని ఓటు మార్చేసింది.

ఇక ఏపీలోనూ స్వల్ప మెజార్టీతో అభ్యర్థులు గెలిచారు. మడకశిరలో 351, గిద్దలూరులో 392 ఓట్ల తేడాతో మారిన ఫలితాలు మారిపోయాయి. నేనొక్కడిని ఓటేయకుంటే ఫలితాలేం తారుమారు కావు కదా? అనుకునే ఓటర్‌కు ఈ ఫలితాలు గొప్ప పాఠం చెబుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..