AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: అంతా చల్లదనమే ఇక.. తెలుగు రాష్ట్రాల్లో ఫుల్‌గా జోరున వర్షాలు.. ఉరుములు, మెరుపులు

దేశంలో గత కొద్దిరోజుల నుంచి ఎండల తీవ్రత, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. అలాంటి వారికి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించడంతో వాతావరణం చల్లగా మారుతోందని.. వర్షం కురవనుందని వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుందని పేర్కొంది.

Rain Alert: అంతా చల్లదనమే ఇక.. తెలుగు రాష్ట్రాల్లో ఫుల్‌గా జోరున వర్షాలు.. ఉరుములు, మెరుపులు
Rains In Ap And Ts
Ravi Kiran
|

Updated on: Jun 05, 2024 | 9:30 PM

Share

దేశంలో గత కొద్దిరోజుల నుంచి ఎండల తీవ్రత, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. అలాంటి వారికి వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రుతుపవనాలు ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించడంతో వాతావరణం చల్లగా మారుతోందని.. వర్షం కురవనుందని వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడనుందని పేర్కొంది. మరికొన్ని చోట్ల మాత్రం అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అసోం, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతం, గోవా, మహారాష్ట్ర, కోస్తాంధ్ర, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వర్షం కురువనుందని వెల్లడించింది. దక్షిణ మహారాష్ట్ర-కొంకణ్-గోవా తీరంలో 35 కిలోమీటర్ల వేగం నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పశ్చిమ అరేబియా తీర ప్రాంతంలో 55 కిలోమీటర్ల వేగం నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

అయితే పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ తూర్పు ప్రాంతం, బీహార్, జార్ఖండ్, ఒడిశాలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండనుందని అధికారులు వివరించారు. రాజస్థాన్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజస్థాన్‌లోని గంగానగర్, చురులో వరసగా 45.2, 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హర్యానా సిర్సా, రోహ్ తక్‌లో 45 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది. ఎండల తీవ్రత నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.

ఇది చదవండి: ఏపీలో విస్తరిస్తున్న రుతుపవనాలు.. ఆ జిల్లాలకు భారీ వర్షసూచన.. పిడుగులు కూడా..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాంఖడే సాక్షిగా చరిత్ర సృష్టించిన సూర్య..కోహ్లీ రికార్డ్ బ్రేక్
వాంఖడే సాక్షిగా చరిత్ర సృష్టించిన సూర్య..కోహ్లీ రికార్డ్ బ్రేక్
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
మద్యం మత్తులో దారుణం.. పెట్రోల్‌ పోసి యువకుడి హత్య!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
వాలెంటైన్స్ డే.. భారీగా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్‌!
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
టీమిండియా వరల్డ్ రికార్డ్.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ సంచలనం
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఓటీటీలో రవితేజ సంక్రాంతి హిట్ సినిమా.. ' స్ట్రీమింగ్ డేట్ ఇదే
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
ప్రేమపెళ్లి చేసుకుని తప్పుచేశా.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి సూసైడ్
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
టాప్‌-10 బెస్ట్‌ సెల్లింగ్‌ బైక్‌లు, స్కూటర్లు.. ధర ఎంతో తెలుసా?
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
హోమ్‌వర్క్‌ చేయలేదనీ.. 2వ తరగతి పిల్లాడిని చితకబాదిన టీచర్‌!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!
కేవలం 300 సెకన్లలో రూ.2700 కోట్ల చారిత్రాత్మక డీల్ చేశారట..!