AP Rains: ఏపీలో విస్తరిస్తున్న రుతుపవనాలు.. ఆ జిల్లాలకు భారీ వర్షసూచన.. పిడుగులు కూడా..

పశ్చిమమధ్య బంగాళాఖాతం మీదుగా నైరుతి బంగాళాఖాతం ఆనుకుని దక్షిణ కోస్తాంధ్ర -ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఆ వివరాలు ఇలా..

AP Rains: ఏపీలో విస్తరిస్తున్న రుతుపవనాలు.. ఆ జిల్లాలకు భారీ వర్షసూచన.. పిడుగులు కూడా..
Rain Alert
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 04, 2024 | 9:22 PM

పశ్చిమమధ్య బంగాళాఖాతం మీదుగా నైరుతి బంగాళాఖాతం ఆనుకుని దక్షిణ కోస్తాంధ్ర -ఉత్తర తమిళనాడు ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. వీటి ప్రభావంతో రేపు,ఎల్లుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి,ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

ఎల్లుండి బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. మంగళవారం సాయంత్రం 7 గంటల నాటికి తిరుపతి జిల్లా చిత్తమూరులో 59మిమీ, చిత్తూరు జిల్లా నగరిలో 53మిమీ, శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో 43.5మిమీ, చిత్తూరు గంగాధరనెల్లూరు 38.5మిమీ,తవణంపల్లెలో 36.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..
అన్నం లేదా చపాతీ.. ఇందులో ఏది తింటే బరువు తగ్గుతారు?
అన్నం లేదా చపాతీ.. ఇందులో ఏది తింటే బరువు తగ్గుతారు?
అల్లు అర్జున్ నివాసంపై దాడి.. ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
అల్లు అర్జున్ నివాసంపై దాడి.. ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి