Lok Sabha Election: నేటితో మూడో దశ ఎన్నికల ప్రచారం ముగింపు.. మే 7న 94 స్థానాల్లో పోలింగ్

దేశంలో ప్రస్తుతం ఏడు దశల్లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు రెండు దశల్లో ఓటింగ్ పూర్తైంది. ఆ తర్వాత మే 7న మూడో దశ పోలింగ్‌ జరగనుంది. మూడో దశ ఓటింగ్ కారణంగా ఈరోజు అంటే మే 5 ఆదివారం రోజున ఎన్నికల ప్రచారం నిలిచిపోనుంది. మే 7న 12 రాష్ట్రాల్లోని 94 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందులో కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Lok Sabha Election: నేటితో మూడో దశ ఎన్నికల ప్రచారం ముగింపు.. మే 7న 94 స్థానాల్లో పోలింగ్
3rd Phase Polling
Follow us

|

Updated on: May 05, 2024 | 12:18 PM

దేశంలో ప్రస్తుతం ఏడు దశల్లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకు రెండు దశల్లో ఓటింగ్ పూర్తైంది. ఆ తర్వాత మే 7న మూడో దశ పోలింగ్‌ జరగనుంది. మూడో దశ ఓటింగ్ కారణంగా ఈరోజు అంటే మే 5 ఆదివారం రోజున ఎన్నికల ప్రచారం నిలిచిపోనుంది. మే 7న 12 రాష్ట్రాల్లోని 94 స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందులో కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మూడో దశ పోలింగ్ జరుగుతున్న నియోజకవర్గాల పరిధిలో అమిత్ షా, శివరాజ్ చౌహాన్, దిగ్విజయ్ సింగ్, డింపుల్ యాదవ్, సుప్రియా సూలే సహా పలువురు ప్రముఖుల భవితవ్యం తేలనుంది. ఇప్పటి వరకు దేశంలోని 21 రాష్ట్రాల్లోని 102 స్థానాలకు తొలి దశలో ఓటింగ్ జరగ్గా, ఏప్రిల్ 26న రెండో దశలో 88 స్థానాలకు పోలింగ్ జరిగాయి. ఆ తర్వాత మూడో విడత పోలింగ్‌కు ఈసీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మే 7న 94 స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మే 13న నాల్గవ దశ, మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1న ఏడో దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

మూడో దశలో ఏయే రాష్ట్రాల్లో ఓటింగ్..!

మూడో విడత ఎన్నికల ప్రచార సందడి నేటి సాయంత్రంతో ఆగనుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై మూడో విడత పోలింగ్‌కు సిద్ధమవుతున్నారు. మూడో దశలో కర్ణాటక, మధ్యప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. అయితే, జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ రాజౌరి స్థానంలో ఎన్నికల సంఘం ఓటింగ్ తేదీని మార్చింది. ఇప్పుడు ఇక్కడ మే 25న ఆరో దశలో ఓటింగ్ జరగనుంది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం ఓటరు అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఎన్నికల బరిలో ప్రముఖులు..

ఇక మే 7న ఈవీఎంలలో భవితవ్యం నిర్లిప్తమయ్యే వారిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరు కూడా ఉంది. గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా అమిత్ షా బరిలో నిలిచారు. మధ్యప్రదేశ్‌లో విదిశా నుంచి మాజీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్, గుణ శివపురి నుంచి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, రాజ్‌గఢ్ నుంచి మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ పేర్లు ఉన్నాయి. వీరితో పాటు ఉత్తరప్రదేశ్‌లోని ములాయం కుటుంబానికి చెందిన డింపుల్ యాదవ్, అక్షయ్ యాదవ్, ఆదిత్య యాదవ్‌ల భవితవ్యం కూడా మంగళవారం ఖరారు కానుంది. మహారాష్ట్రలోని బారామతి సీటులో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, అజిత్ పవార్ భార్య సునేత్రా పవార్‌ల భవితవ్యం కూడా ఈవీఎంలలో ఖరారు కానుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles